పరిగిలో పోలీసులు కార్డన్ సర్చ్

వికారాబాద్ జిల్లా పరిగిలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఖాన్ కాలనీ, బిసి కాలనీ, మందుల గల్లీలో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీసులు తనీఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 45 బైకులు,6 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.కార్డన్ సర్చ్ లో పరిగి డిఎస్పీ శ్రీనివాస్ తో పాటు ఇద్దరు సిఐలు,ఆరుగురు ఎస్సైలు,60 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకే కార్డన్ సర్చ్ నిర్వహించామని డిఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. పోలీసుల ద్వారా శాంతి భద్రతల్లో భరోసా కల్పిస్తూ….అసాంఘిక కార్యకలాపాలను అదుపు చేసేందుకు కార్డన్ సర్చ్ నిర్వహించామని అన్నారు. అపరిచితుల పట్ల, అనుమానితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కాలనీవాసులకు సూచించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article