విశాఖలో ఓ కిడ్నాప్ కేసును పిఎంపాలెం పోలీసులు చేధించారు. డెవలప్‌మెంట్ పేరుతో రామకృష్ణ అనే వ్యక్తిని కిడ్నాపర్లు కిడ్నాప్ చేసి కోటి డిమాండ్ చేశారు. విషయం పోలీసుల కు తెలియడంతో కిడ్నాపర్ల చెర నుంచి బాధితుడిని రక్షించారు.కిడ్నాప్ కేసులో రౌడీ షీటర్ హేమంత్‌తో పాటు మరో ఐదుగురు మధుసూ ధన్,రెహమాన్, మున్న, పవన్ కిరణ్, సుబ్బలక్ష్మీ ప్రమేయం ఉంది. వారందరిని అరెస్టు చేసి వారి నుంచి మారణాయుధాలు, ఫోన్లు, కిడ్నాప్‌కు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నాం. మొత్తం ఆరుగురిలో నలుగురు రౌడీషీటర్లు. హేమంత్‌కు డబ్బు అవసరమ వ్వడంతో డెవలప్మెంట్ పేరు చెప్పి రామకృష్ణను పిలి పించాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం రామ కృష్ణను ఎంబీకే గేస్ట్ హౌస్‌కు పిలిపించి కాళ్లు చేతులు కట్టి నోటికి ప్లాస్టర్ అంటించారు.ప్రాణభయంతో రామ కృష్ణ కిడ్నాపర్లకు 50 లక్షలు ఇవ్వడానికి సిద్ధం అయ్యా డు అని ద్వారకా ఏసిపి రామచంద్రమూర్తి వివరించారు.