కరోనా కిట్ పట్టు – ఓటు కొట్టు!

28
Political parties campain with corona kit
Political parties campain with corona kit

Political parties campain with corona kit

ఎన్నికలు ఉన్నాయంటే చాలు.. రాజకీయ పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఏవేవో జిమ్మిక్కులు ప్రదర్శిస్తుంటారు. పడరాని పాట్లు పడుతుంటారు. ఓటర్లన ఆకర్షించేందుకు ఖరీదైన వస్తువులు బహుమతులు ఇస్తుంటారు. త్వరలో జీహెంచ్ఎంసీ ఎన్నికలు రానున్నాయి. ఇప్పటికే రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు ఓటర్లకు గాలం వేస్తున్నారు. కానీ సారి మాత్రం రాజకీయ నాయకులు రూటును మార్చారు.

డబ్బులు ఇవ్వడమే కాకుండా, విలువైన గిఫ్టులను ఇవ్వడం కామన్. కానీ ఈ సారి అభ్యర్థులు తెలివిగా కరోనా కిట్స్ ను పంచుతున్నారు. కరోనా సీజన్ కావడంతో ప్రచారం ప్రారంభించాయి. అయితే బీరు, బీర్యానీల కాకుండా, శానిటైజర్లు, మాస్కులను అందిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ప్రత్యేకంగా వలంటీర్లను పెట్టుకొని పారాసిటమాల్‌ ట్యాబ్‌లెట్లు, శానిటైజర్లు, విటమిన్‌ మందులను పంపిస్తున్నారు. కొందరు ఉచిత శిబిరాలు ఏర్పాటు చేసి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here