కమలం వైపు .. కొండానే కాదు ఆ నేతలు సైతం

115
Haryana maharashtra huzurnagar poll results 2019
Haryana maharashtra huzurnagar poll results 2019

Politicians are moving to wards bJP

తెలంగాణలో ఇప్పుడు బీజేపీ అధికార టీఆర్ఎస్ పార్టీని జిల్లాల వారిగా ఎదుర్కొనే సమర్ధవంతమైన నాయకులు ఎవరనే దానిపై తీవ్ర కసరత్తే చేస్తోంది . ఈ నేపథ్యంలో టీఆర్ఎస్‌కి కంచుకోటగా ఉన్న వరంగల్‌లో, బీజేపీని బలోపేతం చేసే మాస్‌ లీడర్ల కోసం వేట ముమ్మరం చేశారు. అందులో భాగంగానే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కొండా దంపతులపై ఆపరేషన్ లోటస్ మొదలుపెట్టినట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే బీజేపీకి చెందిన జాతీయస్థాయి నేత వారికి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు జిల్లాలో హాట్‌ హాట్‌గా చర్చ జరుగుతోంది.

కొండా దంపతులతో పాటు తమ కూతురికి పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పిస్తేనే ఆలోచిస్తాం అన్నట్టుగా జిల్లాలో ప్రచారం సాగుతోంది. దీనికి తోడు ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం, పార్టీ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో, కొండా దంపతుల కాషాయ ఎంట్రీ ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది. ఈ వార్తలను వారు ఖండించకపోవడం కూడా పార్టీ మార్పు ప్రచారానికి ఊతమిస్తోంది. వరంగల్‌ కొండా దంపతుల బాటలోనే టిడిపికి చెందిన రేవురి ప్రకాష్ రెడ్డి, ఈగ మల్లేశం, కాంగ్రెస్ ఎర్రబెల్లి స్వర్ణ దంపతులు, మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి లాంటి కీలక నేతలతో పాటు, పలువురు కిందిస్థాయి నేతలు కూడా క్యూలో ఉన్నట్టు చర్చ జరుగుతోంది.

BAGVAT GEETA IN TELUGU BOOK

మొన్నటి ఎన్నికల్లో అనూహ్యంగా కమలం పార్టీకి నాలుగు ఎంపీ స్థానాలు దక్కడంతో తెలంగాణపై జాతీయ నాయకత్వం పూర్తి స్థాయి దృష్టి సారించింది. ఎన్నికల్లో మున్నూరుకాపు సామాజిక వర్గం నుంచి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గెలుపొందారు. దీంతో ఇదే అదనుగా భావించి పనిలో పనిగా టీఆర్ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డీఎస్‌ను కూడా పార్టీలోకి తీసుకున్నట్లయితే, తన సామాజికవర్గంతో పాటు కాంగ్రెస్‌లో తన శిష్యులను వెంట తీసుకువస్తాడని బీజేపీ నాయకత్వం లెక్కలేస్తోంది. అందులో భాగంగానే ఇటీవల రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణను ఇద్దరు ఎంపీలు స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. ఇదే తరహాలో మిగతా జిల్లాల్లోనూ చరిష్మా కలిగిన నేతలే టార్గెట్‌గా పావులు కదుపుతోంది బీజేపీ.

DANCE CONTEST IN HYDERABAD

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here