పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దివంగత వైఎస్సార్ కి వీరాభిమాని. జగన్ అంటే మక్కువ. అందుకే, ఆయన వైకాపా పార్టీ నుంచి ఎంపీ గెలిచి తన సత్తా చాటుకున్నాడు. కాకపోతే, ఆ తర్వాత జరిగిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. కానీ, గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయన టీఆర్ఎస్ పార్టీకి కాస్త దూరంగానే ఉంటున్నాడు. పొంగులేటి బీజేపీలో చేరుతాడనే ప్రచారం జోరుగా జరిగింది. మరోవైపు వైఎస్ షర్మిలతోనూ టచ్‌లో ఉన్నాడనే సంగతి రాజకీయ శ్రేణులకు తెలుసు. అయితే, హఠాత్తుగా మంగళవారం ఆయన ఆమెతో మంతనాలు జరుపుతున్న విషయం బయటికి పొక్కడంతో.. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వైఎస్ షర్మిల పార్టీలో చేరుతున్నాడనే ప్రచారం ఊపందుకుంది. మరి, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడేందుకు కొంత సమయం పడుతుందని సమాచారం.