కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది నియంతృత్వ విధానాలు

హైదరాబాద్: కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు నియంతృత్వ విధానాలు రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అరోపించారు. బుధవారం గాంధీ భవన్ అయన మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలు ముందు పెడుతూ కాంగ్రెస్ పార్టీ సమగ్ర ప్రకటన చేసింది. ఓరుగల్లు ప్రకటన తో కాంగ్రెస్ రైతులు,ప్రజల దగ్గరకు పోతుంది. ఇక్కడ కేసీఆర్, అక్కడ మోడీ విధానాలను ప్రజల్లో ఎండగడతాం. నెల రోజుల నుండి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎండలో ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అమలు అవుతుందా? వడ్లల్లో 33 శాతం తేడా ఉన్నప్పటికీ కూడా 1960 మద్దతు ధర ఇచ్చే బాద్యత ప్రభుత్వానిది. ప్రతి కొనుగోలు కేంద్రంలో తేమ మిషన్లు ఉన్నాయి నాణ్యత ప్రమాణం ప్రకారం 17 శాతం అమలు చేయలని అన్నారు.
తేమ మిషనల్లో వడ్లు పోస్తే 12 రోజులుగా ఎండిన వడ్లు కూడా 23 శాతం చూపించింది. ఎం లేకుండా వట్టి మిషన్ కూడా 1.7 శాతం తేమ చూపిస్తుంది. ఎండలో ఉన్న ఇసుక కూడా 18.7 శాతం తేమ వచ్చింది. అధికారులతో మాట్లాడిన తరువాత మిషన్ల తేమ శాతం 14 కి వచ్చింది. 4 శాతం తగ్గించి ఇవ్వడం వల్ల మిల్లర్లకు లాభం రావడం లేదా…? సివిల్ సప్లయ్ సేకరణ అయితే కేంద్ర ప్రభుత్వం సంచులు ఇస్తదా. గత సంవత్సరం ఇచ్చిన పైసలే ఇవ్వలేదని బస్తా సంచులు వాళ్ళు అంటున్నారు. సంచి 650 గ్రాములు అయితే 1.2 కేజీ అధికంగా వడ్లు తీసుకుంటున్నారని అన్నారు. ఇచ్చిన వడ్లల్లో 11 శాతం మిల్లర్లు అధికారులు దోపిడీ చేస్తున్నారు. కేసీఆర్ ఖబడ్దార్ ఈ ఆటలు మాను. అధికారులతో కొనుగోలు పై సమీక్ష చెయ్. రైతుల పాలిట మోడీ,కేసీఆర్ లు శాపంగా మారారు. రేపు హైదరాబాద్ కి ప్రధాని మోడీ వస్తున్నారు. ఐఎస్బీ కి వచ్చి మోడీ వచ్చి రాజకీయాలు మాట్లాడతారా? రాజకీయాలకు చదువుల సర్టిఫికెట్ అవసరం లేదంటారా…? మోడీ ఏం మెసేజ్ ఇస్తారు. వాళ్లకి చదువుకోకుండా నాలగా ప్రధాని కావాలని చెబుతారా ! అధికారంలోకి వచ్చిన 8 సంవత్సరాలు ఎం చేశావ్. రాష్ట్ర విభజన హామీలు ఎం చేసావు. ఏ పద్ధతి లో నల్ల చట్టాలు తెచ్చారు. కేసీఆర్ ఇక్కడ రైతులను వదిలి పంజాబ్ పోయిండు. వాళ్ళు నల్ల చట్టాల పై నిరసన తెలిపి చనిపోయిన రైతులకు ఇస్తున్నారు..తెలంగాణ రైతులకు కూడా ఇవ్వాలి. మోడీ కరోన సమయంలో ఫార్మా కంపనీ ల సందర్శనకు వచ్చావు. ముఖ్యమంత్రి కి చెప్పావా? ఇది రాజ్యాంగపరమైన అంశం. ప్రజా స్వామ్యం లో ప్రజలు మీకు తప్పకుండా బుద్ధి చెప్తారని పొన్నాల అన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article