Pooja Hedge remuneration
రీసెంట్‌గా వచ్చిన అరవిందసమేత మినహా తెలుగులో సింగిల్ సాలిడ్ హిట్ లేకపోయినా.. స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది పూజా హెగ్డే. మహేష్‌తో `మహర్షి` సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా కోసం ఈ అమ్మడు భారీ మొత్తాన్నే అడిగిందనేది టాక్. దాదాపు 1.75 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్‌గా తీసుకుందట. మహేష్‌లాంటి స్టార్ హీరో ఉన్నా కూడా నిర్మాతలు అంత మొత్తాన్ని ఇచ్చి.. ఆమె దగ్గర బల్క్ డేట్స్ తీసుకున్నారట. ప్రమోషన్స్‌తో పాటు మధ్యలో కూడా సినిమాకు అవసరం అనుకుంటే డేట్స్ అడ్జస్ట్ చేయాలనే కండీషన్ పెట్టారట. అందుకు పూజా కూడా సరేననడంతో భారీ మొత్తాన్ని రెమ్యునరేషన్‌గా చెల్లించారని ఫిలింనగర్ వర్గాల సమాచారం.