Pooja Hedge in Bunny Movie
`జులాయి`, `సన్నాఫ్ సత్యమూర్తి` వంటి రెండు సక్సెస్‌ల తర్వాత మరో సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో రష్మిక మందన్నాను హీరోయిన్‌గా అనుకున్నారు. అయితే సినిమా మార్చిలో ప్రారంభం కానుంది. డేట్స్ సమస్య వచ్చేలా ఉండటంతో మరో హీరోయిన్ వైపు దర్శకుడు త్రివిక్రమ్ మొగ్గు చూపారు. ఆయన గత చిత్రం `అరవింద సమేత`లో నటించిన పూజా హెగ్డేనే తీసుకోవాలని ఆయన అనుకుంటున్నారట. ప్రస్తుతం ఎన్టీఆర్, మహేష్ వంటి స్టార్ హీరోలతో చేసిన పూజా ప్రభాస్‌తో కూడా సినిమా చేయనుంది. ఇది వరకే `డీజే దువ్వాడజగన్నాథమ్`లో బన్నితో కూడా ఆడిపాడింది. దాంతో ఆమె అయితే ఓకే అని యూనిట్ కూడా భావిస్తోందట. త్వరలోనే హీరోయిన్ ఎవరనే దానిపై ఓ క్లారిటీ రానుంది.
For More Click Here
More Latest Interesting news