అఖిల్ కోసం ప్రభాస్ ను ఆపిన మేడమ్

Pooja Hegde Hold Prabhas Movie

అఖిల్ కోసం ప్రభాస్ ను ఆపడం అంటే చిన్న విషయం కాదు కదా.. నిజమే.. ప్రభాస్ రేంజ్ తో పోలిస్తే అఖిల్ ఇంకా సాధారణ రేంజ్ కూడా సాధించని కుర్రాడు. అయినా అతనికే ఇంపార్టెన్స్ ఇచ్చిందంటే ఈ మేడమ్ మామూలుది కాదు అనిపిస్తోంది కదూ.. నిజమే.. ఇప్పుడు అల వైకుంఠపురములో సూపర్ సక్సెస్ తో ఉన్న పూజాహెగ్డే అదే చేసింది. అఖిల్ కోసం ఏకంగా ప్రభాస్ సినిమానే ఆపేసుకుంది. మరి దీని వెనక కథేంటో తెలియాలంటే అసలు విషయం తెలుసుకోవాలి కదా.. ?

సాహో తర్వాత సవాలక్ష మార్పులు చేర్పులు చేసుకుని ప్రభాస్ నెక్ట్స్ మూవీ జాన్ ప్రారంభం అయింది. అయితే అలా ప్రారంభం అయిందో లేదో.. ఇలా పోస్ట్ పోన్ అయింది. కారణం ఏంటీ అంటే.. ఈ షెడ్యూల్ లో ఖచ్చితంగా ఉండాల్సిన పూజాహెగ్డే హెల్త్ బాలేదు. అందుకే వాయిదా పడింది అన్నారు. కానీ  అసలు రీజన్ అది కాదు. అమ్మడు గతంలోనే డేట్స్ ఇచ్చిన అఖిల్ సినిమా కోసమే ప్రభాస్ సినిమాను పక్కన బెట్టింది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తుండటం వల్ల.. వాళ్లను ఎదిరించడం అంత సేఫ్ కాదు కాబట్టే.. పూజా ఈ నిర్ణయం తీసుకుంది. మరి ప్రభాస్ వంటి స్టార్ ను ఆపడం సేఫా అనుకుంటున్నారు కదా.. అక్కడికే వస్తున్నాం..

నిజానికి ఈ మూవీ కోసం పూజా కేటాయించిన డేట్స్ లో సగానికి పైగా ఎప్పుడో అయిపోయాయి. అంటే వాళ్లు పని చేయించుకోలేదు. మళ్లీ ఇప్పుడు కొత్తగా డేట్స్ కావాలంటే ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాలకు ఇబ్బంది కదా. అందుకే ఇప్పుడు అవసరం జాన్ సినిమా వాళ్లది కాబట్టే తను అఖిల్ సినిమాకే నా ఓటు అనేసింది. మొత్తంగా హెల్త్ బాలేదనే కారణం చెప్పి అఖిల్ తో రొమాంటిక్ సీన్స్ అన్నీ పూర్తి చేసింది పూజా. ఇక మిగిలింది పాటలేనట. మొత్తంగా అఖిల్ కోసం ప్రభాస్ వంటి స్టార్ ను హోల్డ్ లో పెట్టిన మేడమ్ గారి డేర్ కు టాలీవుడ్ కూడా ఔరా అనేసుకుంటోంది.

Pooja Hegde Hold Prabhas Movie,Pooja Joins Akhil Movie,Why Pooja Holds Jaan Movie?,Actress Pooja Hegde,Ala Vaikuntapuramloo,Geetha Arts,pooja Dates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *