మళ్లీ దర్శకత్వ ఆలోచనలో

 Planning to direction

రచయితగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన పోసాని కష్ణమురళి తదుపరి దర్శకుడిగా మారారు. ‘ఆపరేషన్ దుర్యోధన’ వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత ‘శ్రావణ మాసం’ డిజాస్టర్ కావడంతో పోసాని దర్శకత్వానికి దూరమ‌య్యారు. ఆ తర్వాత నటుడిగా ఫుల్ బిజీగా మారిపోయారు. ఒక వైపు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోసాని ఓ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారట. రాజకీయ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పరిస్థితులను ఆధారంగా చేసుకుని తెరకెక్కబోయే ఈ సినిమా సెటైరికల్‌గా ఉంటుందని సమాచారం.  సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేసి సమ్మర్‌లో సినిమాను విడుదల చేసేలా పోసాని ప్లాన్ చేస్తున్నారట. 
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article