యాంటీ శాటిలైట్ క్షిపణి పై స్టాంప్

34
postal stamp on a-sat missile
postal stamp on a-sat missile

postal stamp on anti satelite missile

నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ డోవల్ సమక్షంలో ఇంజనీర్స్ డే సందర్భంగా పోస్టల్ విభాగం ఒక కస్టమైజ్డ్ మై స్టాంప్ ఆన్ ఇండియా ఫస్ట్ యాంటీ శాటిలైట్ క్షిపణి (ఎ-సాట్) ను న్యూ ఢిల్లీ లో విడుదల చేసింది. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు, రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఓ) 2019 మార్చి 27 న ఒడిశాలోని డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం ద్వీపం నుండి ఉపగ్రహ (ఎ-సాట్) క్షిపణి పరీక్ష ‘మిషన్ శక్తి’ ను విజయవంతంగా నిర్వహించింది. DRDO అభివృద్ధి చేసిన A-SAT క్షిపణి ‘ఎర్త్ టు కిల్’ మోడ్‌లో లో ఎర్త్ ఆర్బిట్ (LEO) లో భారతీయ కక్ష్యలో ఉన్న లక్ష్య ఉపగ్రహాన్ని విజయవంతంగా ధ్వంసం చేసింది. ఈ ఇంటర్సెప్టర్ క్షిపణి రెండు ఘన రాకెట్ బూస్టర్లతో మూడు దశల క్షిపణి. రేంజ్ సెన్సార్ల నుండి లభించిన ట్రాకింగ్ డేటా ప్రకారం ఈ మిషన్ దాని యొక్క అన్ని లక్ష్యాలను చేరుకున్నట్లు నిర్ధారించింది. స్వదేశీ పరిజ్ఞానం తో తయారుచేయబడిన ఈ ప్రయత్నం, సంక్లిష్టమైన మరియు క్లిష్టమైన మిషన్లను అభివృద్ధి చేయగల దేశ సామర్థ్యాన్ని ప్రదర్శించింది. అనేక పరిశ్రమలు కూడా ఈ మిషన్‌లో పాల్గొన్నాయి. ఈ విజయంతో, భారతదేశం అటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్న ప్రపంచంలో నాల్గవ దేశంగా అవతరించింది.

అజిత్ దోవల్ తన ప్రసంగంలో DRDO ‘మిషన్ శక్తి’ కోసం ముందుకు వెళ్ళడం చాలా ధైర్యమైన చర్య అని పేర్కొన్నారు. DRDO గర్వించదగిన విజయాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు, అయితే భవిష్యత్తు అంతరిక్ష ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంతో ముడిపడి ఉంది. ఉపగ్రహాలు అనేవి కీలకం మరియు ఈ సామర్ధ్యంతో భారతదేశం అంతరిక్షంలో ఉన్న మన అసెట్స్ ను రక్షించగలదు. మిషన్‌ను రహస్యంగా ఉంచిన విధానాన్ని ఆయన ప్రశంసించారు మరియు మిగతా అన్ని రంగాలలో బాగా రాణించినందుకు మొత్తం DRDO  ఫ్రేటర్నిటీని అభినందించారు.

ఈ సందర్భంగా డి.డి.ఆర్ & డి & చైర్మన్ DRDO కార్యదర్శి డాక్టర్ జి సతీష్ రెడ్డి, DRDOకు ఇంత క్లిష్టమైన మరియు సంక్లిష్టమైన మిషన్ను కేటాయించినందుకు గౌరవనీయ ప్రధానమంత్రి మరియు ఎన్ఎస్ఎకు కృతజ్ఞతలు తెలిపారు. ఎ-సాట్ మిషన్ అనేక సాంకేతిక పరిజ్ఞానాలను మరియు అధిక ఎత్తులో ఖచ్చితమైన లక్షాన్ని ఛేదించగల సామర్థ్యాలను అభివృద్ధి చేయగలదని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్టమైన ప్రాజెక్టులను విజయవంతంగా చేపట్టాలని ఆయన DRDO ఫ్రేటర్నిటీకి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోస్టుల శాఖ కార్యదర్శి శ్రీ ప్రదీప్తా కుమార్ బిసోయి, డిఆర్‌డిఓ సీనియర్ సైంటిస్టులు పాల్గొన్నారు. ఈ స్టాంప్ విడుదల దేశానికి గర్వకారణంగా ఉన్న సాంకేతిక సాధన గురించి దేశానికి గుర్తు చేస్తుంది.

DRDO Latest News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here