Monday, March 17, 2025

చీకట్లో పోస్టుమార్టం.. రీ పోస్టుమార్టం చేయండి

ములుగు ఎన్‌కౌంటర్ పై హైకోర్టులో విచారణ

ములుగు ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ములుగు ఎన్‌కౌంటర్ తదుపరి చర్యలు, పోస్టుమార్టం రిపోర్టును అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎన్‌కౌంటర్‌పై మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం మల్లయ్య మృతేదహాన్ని గురువారం వరకు భద్రపరచాలని ఆదేశించింది. మిగిలిన మృతదేహాలను కుటుంబసభ్యులకు అందించాలని చెప్పింది. తదుపరి విచారణను గురువారంకు వాయిదా వేసింది.
సోమవారం విచారణలో మంగళవారం వరకు మృతదేహాలను భద్రపరచాలని హైకోర్టు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. నేడు మరోసారి పిటిషనర్ తరపున, అలాగే ప్రభుత్వం తరపున వాదనలు కొనసాగాయి. అయితే మృతదేహాలపైన అనేక గాయాలు ఉన్నాయని, ఇదొక బూటకపు ఎన్‌కౌంటర్ అంటూ పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. భద్రపరిచిన మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించాలని పదే పదే కోరారు. మరోవైపు నిన్న హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన సమయంలో పోస్టుమార్టం అంతా కూడా చీకటిలో నిర్వహించారని, పంచనామా ప్రక్రియ సరిగ్గా నిర్వహించలేదు కాబట్టి రీపోస్టుమార్టం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు.
అలాగే ప్రభుత్వం తరపున న్యాయవాది కూడా తన వాదనలు వినిపిస్తూ.. ఎన్‌హెచ్‌ఆర్సీ గైడ్‌లెన్స్‌ ప్రకారం, అలాగే హైకోర్టు ఆదేశాల మేరకే శవ పరీక్షలు పూర్తి చేశామని స్పష్టం చేశారు. కేవలం ఎదురుకాల్పుల్లో మాత్రమే మావోలు మృతిచెందారని ప్రభుత్వ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఎక్కడా కూడా ఇది బూటకపు ఎన్‌కౌంటర్ కాదని, ఆహారంలో ఎలాంటి విషం ఇవ్వలేదని న్యాయవాది స్పష్టం చేశారు. ఎనిమిది మంది వైద్య నిపుణులతో పోస్టుమార్టం పూర్తి చేశామని వాటికి సంబంధించి ఫోటోగ్రఫీ కూడా కోర్టుకు అందజేస్తున్నామని ప్రభుత్వం తరుపున న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. మృతదేహాలను భద్రపరిచనట్లైతే శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని.. అందుకే మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించేందుకు ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com