కోకాపేట్ లో పౌలోమీ అవంతి

ఆకర్షణీయమైన నిర్మాణాల్ని చేపట్టే పౌలోమీ ఎస్టేట్స్ కొత్తగా.. కోకాపేట్లో సరికొత్త ఆకాశహర్మ్యాన్ని ఆరంభించింది. 4.75 ఎకరాల్లో 475 ఫ్లాట్లను నిర్మిస్తోంది.

పౌలోమి సంస్థ కోకాపేట్లో 23 అంతస్తుల (2 సెల్లార్లు, గ్రౌండ్ ప్లస్ 22) పౌలోమీ అవంతి అనే బ్యూటీఫుల్ ప్రాజెక్టును ప్రారంభించింది. మీకు ప్రశాంతమైన జీవనాన్ని తమ నిర్మాణాలు అందజేస్తాయని సంస్థ చెబుతోంది.

హైదరాబాద్ నిర్మాణ రంగంలో కోకాపేట్ ప్రాంతానికి గల డిమాండ్ అంతాఇంతా కాదు. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చేరువగా ఉండటంతో కోకాపేట్ ఎవర్ గ్రీన్ గా మారింది. ఐటీ సంస్థలు, బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ కంపెనీలన్నీ ఇక్కడ్నుంచి కూతవేటు దూరంలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ అంశాన్ని గమనించిన అనేక సంస్థలు కోకాపేట్లో కొత్త ప్రాజెక్టుల్ని ప్రకటిస్తున్నాయి. తాజాగా, పౌలోమీ సంస్థ అవంతి అనే చూడచక్కటి నిర్మాణాన్ని ఆరంభించింది. ఈ ప్రాజెక్టుకు తెలంగాణ రెరా అథారిటీ నుంచి అనుమతి కూడా లభించింది.

  • ఈ ప్రాజెక్టును సుమారు 4.75 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్నారు. మొత్తం మూడు బ్లాకుల్లో 475 ఫ్లాట్లు వస్తాయి. రెండు సెల్లార్లు, గ్రౌండ్ తో కలిపి సుమారు 22 అంతస్తుల ఎత్తులో అవంతిని నిర్మిస్తారు. ఇందులో వచ్చేవన్నీ ట్రిపుల్ బెడ్ రూం ఫ్లాట్లే. విస్తీర్ణం 1,555 నుంచి 2,575 దాకా కడతారు. ఈ ప్రాజెక్టు ప్రత్యేకత ఏమిటంటే.. అత్యాధునిక క్లబ్ హౌజ్ ను దాాదాపు 28 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కడతారు. ఇందులో ఔట్ డోర్ మరియు ఇండోర్ జిమ్ కు స్థానం కల్పిస్తారు. క్రికెట్ పిచ్, బాస్కెట్ బాల్ హాఫ్ కోర్టు, 2200 చదరపు అడుగుల బ్యాడ్మింటన్ కోర్టు, స్విమ్మింగ్ పూల్ వంటివి ఏర్పాటు చేస్తారు. ప్రతి లాబీ ఎంట్రెన్స్ ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. ప్రాజెక్టు చుట్టూ సీసీ టీవీ కెమెరాల్ని అమర్చుతారు. దీంతో సెక్యూరిటీ విషయంలో దిగులు చెందాల్సిన అవసరం లేదు.

#POULOMI AVANTE

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article