Saturday, April 19, 2025

ప్రభాస్‌ని చంపేస్తే.. ఫ్యాన్స్‌ ఒప్పుకుంటారా?

తెలుగు ప్రేక్షకులు సినిమాలో ఎన్ని ట్విస్ట్‌లు.. ఎన్ని ఎమోషన్స్‌ ఉన్నా.. క్లైమాక్స్‌ మాత్రం శుభం కార్డు పడితేనే ఇక్కడ సినిమా హిట్‌ అవుతుంది. అంటే పాజిటివ్‌ ఎండింగ్‌ ఉండాలి. అలా అవ్వకపోతే మనవాళ్లు ఒప్పుకోరు. ఇప్పడిప్పుడే ఈ ట్రెండ్ నుంచి నిధానంగా కాస్త..కాస్త.. బయట పడుతున్నారు టాలీవుడ్ ఆడియన్స్. అయితే తమిళ్, మలయాళం ఇండస్ట్రీలో అలా కాదు. వాళ్లు హీరోలను క్లైమాక్స్ లో నిర్దాక్షణ్యంగా చంపేస్తుంటారు. ఇక మనదగ్గర అలా చేస్తే సినిమా ప్లాప్ ఖాయం. తాజాగా ప్రభాస్ సినిమా కోసం విషాద క్లైమాక్స్ ను ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు. మరి అది వార్కౌట్ అవుతుందా.?

ఈ గ్లామర్ ఫీల్డ్ లో హీరోలు చాలా హ్యాండ్సమ్ గా, అందంగా కనిపించాలి, పదిమందిని కొట్టాలి, యాక్షన్ సీన్స్ తో హీరోయిజం చూపించాలి అలా అయితేనే మనవాళ్ళు యాక్సప్ట్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో మరీ ఇంతలా ఆలోచించకపోయినా.. హీరో డీ గ్లామర్ లుక్ లో కనిపించినా ఒప్పుకుంటారు. కాని తమఅభిమాన హీరోని సినిమా క్లైమాస్స్ లో చంపేస్తాం అంటే మాత్రం ఫ్యాన్స్ అస్సలు ఒప్పుకోరు. సినిమాల్లో కాదు.. కలలో కూడా తమ అభిమాన హీరోని చంపేస్తాం అంటే ఊరుకోరు. తమిళంలో అలా కాదు. ఎంత పెద్ద హీరో అయినా కథ డిమాండ్ చేస్తే చచ్చిపోవాల్సిందే.

గతంలో విజయ్ కాంత్ రమణ సినిమా క్లైమాక్స్ లో ఆయన పాత్రకు ఉరిపడుతుంది. అదే సినిమాను చిరంజీవితో ఠాగూర్ పేరుతో తెరకెక్కిస్తే.. చిరంజీవిని కోర్డ్ అర్ధం చేసుకుని శిక్ష తక్కువ పడేలా కథను మార్చేశారు. అలా చెప్పుకుంటూ పోతే చాలా చిత్రాలే ఉన్నాయి.
ఇలా మన సినిమాలో హీరోకు ఏదైనా అయితే ఫ్యాన్స్ ఊరుకోరు. అయితే ఈమధ్య ఈ మైండ్ సెట్ ఉన్న ఆడియన్స్ తగ్గుతున్నారు. దాంతో కాస్త కాన్సెప్ట్ ఓరియెంట్ తో సినిమాలు వస్తున్నాయి.

తాజాగా ప్రభాస్ సినిమా కోసం అలాంటి క్లైమాక్స్ నే ప్లాన్ చేశాడట స్టార్ డైరెక్టర్. తన సినిమా క్లైమాక్స్ లో ప్రభాస్ పాత్రను చంపేయబోతున్నాడట. ఇంతకీ ఆ సినిమా ఏదో తెలుసా? హనురాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కతున్న సినిమాకోసం ఈ క్లైమాక్స్ ను ప్లాన్ చేశారట. ఫౌజీ పేరుతో ప్రచారంలో ఉన్న ఈసినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com