`ఆర్ఆర్ఆర్‌`లో ప్ర‌భాస్‌?

Prabhas in RRR Movie
బాహుబ‌లి చిత్రం త‌ర్వాత రాజ‌మౌళి నేష‌న‌ల్ డైరెక్ట‌ర్ అయ్యాడు. ఆయ‌న త‌దుప‌రి చిత్రంపై అంద‌రి దృష్టి నెల‌కొని ఉంది. ఈ క్రేజ్‌ను ఏమాత్రం త‌గ్గ‌కుండా ఉండేలా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్‌ల‌తో మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేశాడు. `ఆర్ ఆర్ ఆర్` పేరుతో ఇప్పుడు సినిమా రెండో షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఈ సినిమాకు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. సినిమాపై హైప్ మ‌రింత పెంచ‌డానికి రాజ‌మౌళి ఈ సినిమాలో ప్ర‌భాస్‌ను చిన్న అతిథి పాత్ర‌లో న‌టింప చేయాల‌నుకుంటున్నాడ‌ని స‌మాచారం. ఇందులో నిజా నిజాలు తెలియ‌వు కానీ.. ఇది క‌నుక నిజ‌మైతే ప్ర‌స్తుత ట్రెండ్‌లో టాలీవుడ్‌లో రూపొందే భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ ఇదే అవుతుంది. సినిమాపై అంచ‌నాలు పదింత‌లు పెరుగుతాయి.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article