ప్రభాస్ వైజయంతికి హ్యాండ్ ఇచ్చాడా..?

23
prabhas movie update
prabhas movie update

prabhas movie update

ప్రభాస్.. సైలెంట్ గా దూకుడు పెంచాడు. బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియన్ ఇమేజ్ విషయంలో చాలా స్ట్రాంగ్ డెసిషన్ తో ఉన్నాడు ప్రభాస్.  ఆ ఇమేజ్ ను రాబోయే రోజుల్లో బలంగా సస్టెయిన్ చేయాలనుకుంటున్నాడు. ఈ క్రమంలో చేసిన సాహో సౌత్ లో తేలిపోయినా.. కమర్షియల్ గా నార్త్ లో సత్తా చాటింది. ఇది కూడా ప్రభాస్ లో కాన్ఫిడెన్స్ ను మరింత పెంచింది. అదే టైమ్ లో మరోసారి ఇలాంటి రొటీన్ సినిమా చేస్తే అక్కడా ఇబ్బందులు తప్పవు అన్న సంకేతాలూ వచ్చాయి. దీంతో రాధేశ్యామ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కథలో మార్పులు చేర్పులు చేశారు. అయితే ఎందుకో ప్రభాస్ ముందు నుంచీ రాధేశ్యామ్ పై అంత సీరియస్ గా ఉన్నట్టు కనిపించలేదు. అందుకే ఫస్ట్ లుక్ పోస్టర్ విషయంలో ఎన్ని కమెంట్స్ వచ్చినా ఎవరూ రెస్పాండ్ కాలేదు. ఇక ఈ మూవీతో పాటు అనౌన్స్ అయిన నాగ్ అశ్విన్ సినిమా విషయంలో ఫ్యాన్స్ లో సరికొత్త జోష్ కనిపించింది. ఆ జోష్ లో వాళ్లుండగానే ఈ సారి డైరెక్ట్ బాలీవుడ్ మూవీ అనౌన్స్ అయింది. పరిశ్రమ మొత్తాన్ని సర్ ప్రైజ్ చేసిన ఈ అనౌన్స్ మెంట్ తో ప్రభాస్ దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది. రీసెంట్ గా ‘తన్హాజీ’తో సత్తా చాటిన బాలీవుడ్ మేకర్ ఓమ్ రౌత్ డైరెక్షన్ లో రూపొందే భారీ సినిమా ‘ఆదిపురుష్’లో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. అతనితో పాటు మరో ఇంపార్టెంట్ హీరో కూడా ఉంటాడు.

కానీ ఈ ప్రాజెక్ట్ కు మెయిన్ ఎస్సెట్ గా నిలిచేది మాత్రం ఖచ్చితంగా ప్రభాస్ అనేది కాదనలేని సత్యం. అయితే ఇటు నాగ్ అశ్విన్ సినిమా లైన్ లో ముందు ఉన్నా కూడా ప్రభాస్ ఎందుకో ఆదిపురుష్ పై అధిక ఆసక్తితో కనిపిస్తున్నాడు. అతని ఆసక్తి మేరకే దర్శకుడు ఓమ్ రౌత్ కూడా ఆదిపురుష్ ను వచ్చే యేడాది ఆరంభలోనే మొదలుపెడతాను అంటున్నాడు. దీంతో ప్రభాస్ ముందు కమిట్ అయిన వైజయంతీ సినిమాకు హ్యాండ్ ఇచ్చాడా..? అనే అనుమానాలూ కలుగుతున్నాయి. నిజానికి సిట్యుయేషన్ క్లియర్ గా ఉంటే నాగ్ అశ్విన్ కూడా వచ్చే యేడాది మార్చి నుంచి ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టాలనుకున్నాడు. కానీ ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ మాత్రం జనవరి నుంచే అంటున్నాడు. అంటే ప్రభాస్ కూడా వెళ్లాల్సి ఉంటుంది కదా. సో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ ఇంకా వెనక్కి వెళ్లిపోతుంది. పైగా ఇది భారీ బడ్జెట్ సినిమా కాబట్టి షూటింగ్ డేస్ కూడా చాలానే ఉంటాయి. మరవైపు రాధేశ్యామ్ కూడా ఇంకా చాలా వర్క్ పెండింగ్ లో ఉంది. అక్టోబర్ నుంచి మొదలుపెట్టి రెండు నెలల ఏకధాటి షెడ్యూల్ తో రాధేశ్యామ్ ఫినిష్ చేసి ఆ తర్వాత ఆదిపురుష్ వైపు వెళ్లాలనుకుంటున్నాడట ప్రభాస్. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతానికి వైజయంతి బ్యానర్ కు హ్యాండ్ ఇచ్చినట్టే అర్థం చేసుకోవాల్సిందేనేమో.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here