విక్రమాదిత్యగా ప్రభాస్‌ : సర్ ప్రైజ్ ఇదే

214
Prabhas new movie First Look
Prabhas new movie First Look

Prabhas new movie First Look

ప్రభాస్ ఇప్పుడొక యూనిక్ హీరో. ఆయన కోసమే ప్యాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు దర్శకులు. ఇందులో భాగంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ప్యాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’సర్‌ప్రైజ్ వచ్చేసింది. ప్రభాస్‌ పుట్టిన రోజు(అక్టోబర్‌ 23) సందర్భంగా సినిమాలో ప్రభాస్‌ పాత్ర పేరును రివీల్‌ చేస్తూ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ వదిలింది చిత్రబృందం. రాదేశ్యామ్‌లో విక్రమాదిత్యగా ప్రభాస్‌ అలరించనున్నాడు. ఈ పోస్టర్‌లో ప్రభాస్ చాలా రాయల్ లుక్‌లో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు.

చాలా రోజుల తర్వాత తమ అభిమాన హీరో మూవీ అప్‌డేట్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ ప్యాన్‌ ఇండియా సినిమాకి రాధా కృష్ణకుమార్‌ దర్శకుడు. కృష్ణంరాజు సమర్పణలో ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పూజా ద్విపాత్రాభినయం చేయనున్నారని టాక్‌. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన ‘బీట్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌’ను అక్టోబర్‌ 23న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు వచ్చింది. అన్ని భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here