Prabhas Steps
సాహో సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ సినిమా కోసం ముంబై వర్లీకి సంబంధించిన సెట్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సంగతి తెలిసిందే. త్వరలో అక్కడ ప్రభాస్‌కు, నీల్ నితిన్ ముఖేష్‌కు మధ్య ఫైటింగ్ సన్నివేశాలు పూర్తవుతాయట. దాంతోకాసేపు యాక్షన్‌కు రెస్ట్ ఇద్దామని అనుకుంటున్నారట దర్శకుడు సుజిత్. నెక్స్ట్ ఇమీడియేట్‌గా ప్రభాస్, పూజా హెగ్డే మధ్య రొమాంటిక్ సాంగ్స్ ని తీద్దామని అనుకుంటున్నారట. ఇంకా మూడు పాటలను తెరకెక్కించాల్సి ఉంది. వాటిలో ఏదో ఒక పాటను ముందు తీయాలని నిర్ణయించుకున్నట్టు వినికిడి. యువీ క్రియేషన్స్ 300 కోట్ల వ్యయంతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ రూపొందుతోంది. ప్రభాస్ కథానాయకుడిగా `బాహుబలి` సీక్వెల్స్ తర్వాత చేస్తున్న సినిమా ఇది. శ్రద్ధా కపూర్ నాయిక. నీల్ నితిన్ ముఖేష్, ఎవ్లిన్ శర్మ, లాల్, అరుణ్ విజయ్, శ్రబంతి చటర్జీ, మహేష్ మంజ్రేకర్, చుంకీ పాండే, జాకీ ష్రాఫ్, వెన్నెల కిశోర్, సాషా చెత్రి, తిన్ను ఆనంద్, నవీన్ వర్మ గణపతిరాజు, ఆదిత్య శ్రీవాస్తవ, శివకృష్ణ, మురళీ శర్మ తదితరులు ఇతర పాత్రల్లో కనిపిస్తారు. వంశీ, ప్రమోద్ కలిసి నిర్మిస్తున్న సినిమా ఇది.