బాలీవుడ్‌లో ఇప్పుడు తక్కువైంది కానీ.. ఒకప్పుడు సినిమాలో నటించే ప్రతి హీరో హీరోయిన్‌కీ మధ్య ఓ ప్రేమకథని అల్లేసి గాసిప్పులు వ్యాప్తి చేసేవారు. ఆ పుకార్లని ఎంజాయ్ చేసే జంటలు కొన్నయితే,కొద్దిమంది మాత్రం ఎందుకొచ్చిన తంటా అని తలలు పట్టుకునేవాళ్లు.దర్శకనిర్మాతలు మాత్రం తమ సినిమా బిజినెస్‌కి పనికొస్తుందన్నట్టుగా చూసీ చూడనట్టుగా వ్యవహరించేవాళ్లు. ఆ సంస్కృతి ఇప్పుడు తక్కువైంది కానీ..అప్పుడప్పుడూ మాత్రం ఏదో రకంగా కొన్ని జంటలపై వార్తలు స్పెక్యులేట్ అవుతుంటాయి. ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్న ప్రభాస్, కృతి సనన్ జంట మధ్య కూడా సమ్‌థింగ్
సమ్‌థింగ్ అంటూ పుకార్లు షికార్లు చేశాయి.
వాటిని మరింత బలం చేకూర్చేలా యువ హీరో వరుణ్ ధవన్ ఓ రియాలిటీ షోలో కామెంట్ చేశాడు.కృతిసనన్ మనసు దోచినవాడు సౌత్ నుంచి వచ్చాడని, ఇప్పుడు దీపికా పదుకొణేతో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడని మాట్లాడాడు. దాంతో ప్రభాస్‌కీ, కృతికీ మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్టే అంటూ అంతా ఓ నిర్ణయానికొచ్చేశారు. కానీ నిజానికి మా మధ్య ఏమీ లేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది కృతిసనన్. “ఆ ఇన్సిడెంట్ తర్వాత నేను ప్రభాస్‌కి ఫోన్ చేశా. ఇలా జరిగిందని చెప్పా. “వరుణ్ ఎందుకలా చెప్పాడు?` అని సీరియస్‌గానే అడిగాడు ప్రభాస్. నాకున్న మ్యాడ్ ఫ్రెండ్స్‌లో తనొకడు. వదిలేయ్ ఇంతటితో అని చెప్పా“ అని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది కృతిసనన్. ప్రభాస్, కృతి కలిసి నటించిన ఆదిపురుష్ మరో వంద రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.