Prabhas To Work With Sandeep Reddy
ప్రభాస్.. ప్రస్తుతం సౌత్ నుంచి ఉన్న మెయిన్ ప్యాన్ ఇండియన్ స్టార్. కాకపోతే సాహో ఆశించినంతగా ఆకట్టుకోలేదు. అయినా అతని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా బాలీవుడ్ లో ప్రభాస్ కు క్రేజ్ మామూలుది కాదు. అందుకే అతను ఏ సినిమా చేసినా కాస్త బలమైన కథ, కథనాలు రాసుకుంటే ఖచ్చితంగా ప్యాన్ ఇండియన్ రేంజ్ లో పేలుతుంది. అందుకే ప్రభాస్ తో ఫలానా దర్శకుడి సినిమా అంటూ సులువుగా రూమర్స్ వస్తున్నాయి. తాజాగా మరో దర్శకుడితో అతను డైరెక్ట్ బాలీవుడ్ మూవీ చేయబోతున్నాడు అనే న్యూస్ హల్చల్ చేస్తోంది.
అర్జున్ రెడ్డితో కంట్రీ మొత్తం క్రేజ్ తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా త్వరలో ప్రభాస్ ను డైరెక్ట్ చేయబోతున్నాడనేది లేటెస్ట్ న్యూస్. అర్జున్ రెడ్డినే బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా తీసి ఏకంగా మూడు వందల కోట్లు కొల్లగొట్టిన సందీప్ ఆ తర్వాత రణ్ బీర్ కపూర్ తో సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వచ్చినా.. ఇంకా ఏవీ కన్ఫార్మ్ కాలేదు. ఓ రకంగా చెబితే కబీర్ సింగ్ వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత కూడా సందీప్ ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాడు. అందుకే ప్రభాస్ తో సినిమా అనే వార్త ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇటు ప్రభాస్ కూడా సాహో ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితమైన కథ ఉండి.. బలమైన స్క్రీన్ ప్లేస్ రాసుకుని బౌండ్ స్క్రిప్ట్ తో వస్తేనే సినిమా అనే కండీషన్ పెట్టేశాడు. సందీప్ కు మోడర్న్ సినిమాపై పట్టుంది. అందువల్ల ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీకి అతను పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతాడనే చెప్పాలి. మరి నిజంగా ఇది త్వరలో అనౌన్స్ కాబోతోన్న వార్తా.. లేక ఎప్పట్లానే మరో రూమరా అనేది చూడాలి.