ఎన్టీఆర్ దర్శకుడితో ప్రభాస్ నెక్ట్స్ మూవీ

27
prabhas with atlee
prabhas with atlee

prabhas with atlee

మధ్యలో కాస్త లేజీగా అనిపించినా ఎందుకో ప్రభాస్ సడెన్ గా దూకుడు పెంచాడు. వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. అంతే కాదు.. 2020లో వచ్చిన లాస్ ను నెక్ట్స్ ఇయర్ వరకూ పూర్తి చేయాలనే కసితో కనిపిస్తున్నాడు. మరీ నెక్ట్స్ ఇయర్ వరకూ అంటే కష్టం. కానీ 2022లో రెండు సినిమాలు విడుదలయ్యేలా .. వీలైతే మూడో సినిమా కూడా వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు. 2021లో ఎలాగూ రాధేశ్యామ్ వస్తుంది. ఆ తర్వాత ఆదిపురష్, అలాగే నాగ్ అశ్విన్ సినిమా ఉంటుంది. మరి 2022లో మూడో సినిమా ఏంటీ అనుకుంటున్నారా.. యస్.. దీని గురించే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇంకా చెబితే దర్శకుడు కూడా ఫైనల్ అయ్యాడు అంటున్నారు. ఇది కూడా ప్యాన్ ఇండియన్ సినిమానే. అఫ్ కోర్స్.. ఇకపై ప్రభాస్ తో ఎవరు సినిమా చేసినా అది ప్యాన్ ఇండియన్ స్క్రిప్టే అయి ఉండాలి. ఆదిపురుష్ వచ్చే యేడాది ఆరంభంలోనే ప్రారంభం అవుతుంది. అలాగే ఈ అక్టోబర్ నుంచి రాధేశ్యామ్ రెగ్యులర్ షూట్ కు వెళ్లే అవకాశాలున్నాయి. అయితే ముందు ఆదిపురుష్ గా వెళతాడా లేక నాగ్ అశ్విన్ సినిమా చేస్తాడా అనేది ప్రస్తుతం కొంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. కాకపోతే ఆదిపురుష్ లో ప్రభాస్ ది మరీ సినిమా అంతా ఉండే పాత్ర కాదు. అయినా ఆ సినిమాను అతనే మెయిన్ ఎస్సెట్ అవుతున్నాడు. అందుకే ముందుగా ఆదిపురుష్ నే పూర్తి చేస్తాడు అంటున్నారు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ సినిమా మొదలవుతుంది. బట్.. ఈ రెండు సినిమాలూ 2022లోనే విడుదలవుతాయి.

అలాగే ఒకటి 2021లోనే పూర్తవుతుంది. అందుకే ఆ వెంటనే మరో సినిమాకు ప్లానింగ్ చేసుకున్నాడు ప్రభాస్ అంటున్నారు. తమిళ్ లో మాస్ ను ఊపేసే దర్శకుల్లో ఇప్పుడు బాగా వినిపించే పేర్లలో ఒకటి ఆట్లీ. ఏంటీ ఆశ్చర్యపోతున్నారా.. ప్రభాస్ తో ఆట్లీ ఏంటీ.. అని. నిజమే.. ఇండస్ట్రీలో ఏదైనా జరగొచ్చు. ఆర్య వంటి సాధారణ హీరోతో చేసిన ఆట్లీకి ఆ వెంటనే విజయ్ వరుసగా ఛాన్స్ లు ఇవ్వలేదా.. ? ఏదైనా కథలో ఉంటుంది. అలాగే దాన్ని డీల్ చేసే సత్తా ఆ దర్శకుడులో ఉందా లేదా అనేది ప్రీవియస్ సినిమాలు చెబుతాయి. అలా చూస్తే సౌత్ లో మాసివ్ డైరెక్టర్స్ లిస్ట్ లో ప్రస్తుతం ఆట్లీ పేరు ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఆట్లీ ముందు ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడు అనుకున్నారు. కానీ వచ్చే రెండేళ్లలో ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యేలా లేదు. ఈ లోగా అతను ప్రభాస్ కు కథ చెప్పాడనీ.. ప్రస్తుతం తను చేస్తోన్న సినిమాలకు భిన్నమైన మాసివ్ ఎలిమెంట్స్ ఉన్న ఆ కథ ప్రభాస్ కు బాగా నచ్చిందని టాక్ వినిపిస్తోంది. అన్నీ కుదిరితే ఈ యేడాదిలోనే ఈ ప్రాజెక్ట్ గురించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందంటున్నారు. మరి ఆట్లీ ప్రభాస్ తో వెళితే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో చేస్తాడా లేక.. త్రివిక్రమ్ వంటి దర్శకుల వద్దే ఆగుతాడా అనేది చూడాలి.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here