వి.ప్రకాశ్ కు పర్యావరణ సంరక్షక్ అవార్డు..

V Prakash is Environment Protection Award
జలవనరుల రంగంలో ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వం,జలవనరుల అభివృద్ది సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్ చేస్తున్న విశేష కృషి కి దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తున్నది. వాటర్ మాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ సారధ్యం లోని తరుణ్ భారత్ సంగ్ “పర్యావరణ సంరక్షక్” అవార్డుకు వి.ప్రకాశ్ ను ఎంపిక చేసింది. జనవరి 15,16తేదీల్లో రాజస్థాన్ బీకంపురా లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డు ను మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ,ముని మనుమడు తుషార్ గాంధీ చేతుల మీదుగా వి.ప్రకాశ్ అందుకున్నారు. ఈ సందర్భంగా రాజేంద్ర సింగ్ వి.ప్రకాశ్ దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుండి ప్రముఖ పర్యావరణ వేత్తలు,జల వనరుల పరిరక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సామాజిక కార్య కర్తలు, పలువురు IAS, IFS అధికారులు హాజరయినారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను తన ప్రసంగం లో వి.ప్రకాశ్ ప్రస్తావించారు. గతంలో తన జన్మ దినాన్ని వాటర్ మాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ నెక్కొండ లోని మిషన్ కాకతీయ చెరువు గట్టున జరుపు కోగా వి.ప్రకాశ్ తన 62వ జన్మదినాని రాజేంద్ర సింగ్ ఆశ్రమంలో జరుపుకోవడం విశేషం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article