కేటీఆర్‌ను ప్ర‌కాష్‌రాజు ఎందుకు క‌లిశాడో?

సినీనటుడు ప్రకాష్ రాజ్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. జ‌స్ట్ ఆస్కింగ్ హాష్ ట్యాగ్‌లో గ‌త కొంత కాలంగా బీజేపీ శ్రేణుల‌పై విరుచుకుప‌డుతున్న‌ప్ర‌కాష్‌రాజ్ త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో పోటీకి దిగుతున్నాను అంటూ ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించి సంచ‌ల‌నం సృష్టించారు. కొత్త సంవ‌త్స‌రం .. కొత్త ప్ర‌యాణం.. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో పోటీకి దిగ‌బోతున్నాను. ఇక అక్క‌డ ప్ర‌శ్నించ‌డం మొద‌లుపెడ‌తాను అంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన ప్ర‌కాష‌రాజ్ దానికోసం వ‌డివ‌డిగా అడుగులు వేయ‌డం మొద‌లుపెట్టారు.

గ‌త కొంత కాలంగా తెరాస‌కు బాహాటంగా మ‌ద్ద‌తు తెలుపుతూ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు, కేటీఆర్‌కు అత్యంత స‌న్నిహితంగా మెలుగుతున్న ప్ర‌కాష్‌రాజ్ కేటీఆర్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఆయ‌న‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెల‌ప‌డంతో పాటు క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో త‌ను పోటీకి దిగ‌బోతున్న విష‌యాన్ని వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా త‌మ పూర్తి మ‌ద్ద‌తు వుంటుంద‌ని, స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకున్నార‌ని కేటీఆర్ అభినందించారు. శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో ధైర్యంగా ముందుకొచ్చి త‌మ‌కు మ‌ద్దతుగా నిలిచినందుకు ఈ సంద‌ర్భంగా ప్ర‌కాష్‌రాజ్‌కు కేటీఆర్ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. నిక్క‌చ్చిగా వ్య‌వ‌హ‌రించే ప్ర‌కాష్‌రాజ్ లాంటి వ్య‌క్తులు రాజ‌కీయాల్లోకి రావాల్సిన అవ‌స‌రం ఎంతో వుంద‌ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. అయితే ప్ర‌కాష్‌రాజ్ పొరుగున పోటీ చేసినా ఆయ‌న‌కు గులాబీ పార్టీ ఎలాంటి మ‌ద్ధ‌తునివ్వ‌బోతోంది? అన్న‌ది ఇప్ప‌టికి స‌స్పెన్స్.  ఒక పక్క ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు జరుగుతున్న తరుణంలో స్వతంత్ర అభ్యర్థి అయిన ప్రకాష్ రాజ్ గెలిస్తే ఉపయోగపడతాడు అనే కాన్సెప్ట్ ఉండి వుంటుంది అన్న చర్చ సాగుతుంది.

Reasons for Prakash Raj Met KTR

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article