ఎంపీగా ఎన్నికల బరిలో ప్రకాష్ రాజ్

Prakash Raj participating in MP

రానున్న సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో రాష్ట్రంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న కొత్త సంవత్సరం సందర్భంగా సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఓ సంచలన ప్రకటన చేశాడు. ఈ ఏడాది జరగబోతున్న లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నట్లు ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇక తాజాగా ఆయన ఎక్కడ నుండి బరిలోకి దిగానున్నారో కూడా ఫిక్స్ అయిపోయిందని సమాచారం.
ఏ నియోజక వర్గం నుండి పోటీ చేయనున్నారనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని చెప్పిన ప్రకాష్ రాజ్ మీ అందరి సపోర్ట్ తో నేను రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను. ప్రజల గొంతుని పార్లమెంట్ లో వినిపిస్తాను” అంటూ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే . రజినీకాంత్, కమల్ హాసన్ తరువాత రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన వారిలో ప్రకాష్ రాజ్ మూడో వ్యక్తిగా నిలిచారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేసిన రాజకీయ ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఆయన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి మాట్లాడారు. తెలంగాణా రాష్ట్రంలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
ఇక తాజాగా ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ తాను పోటీ చేసే నియోజకవర్గం ఏదో ట్వీట్ చేశారు .లోకసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించారు. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని ప్రకాష్ రాజ్ చెప్పారు. సిటిజన్స్ వాయిస్ నినాదంతో ఆయన పార్లమెంటు బరిలోకి దిగుతున్నారు. తన నూతన ప్రయాణానికి లభిస్తున్న ప్రోత్సాహకర స్పందనకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మిగతా వివరాలను మీడియా ముఖంగా త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. తన రాజకీయ ప్రయాణానికి ప్రోత్సాహాన్ని ఇచ్చినందుకు ఆయన ఇటీవల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు ధన్యవాదాలు తెలిపారు. మొత్తానికి బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుండి ప్రకాష్ రాజ్ పోటీ చేస్తున్నట్టు ఆయన ఎలాంటి సస్పన్స్ కు తావు ఇవ్వకుండా తేల్చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article