ధూమ్ -4 లో ప్రభాస్.. అయ్యే పనేనా..?

25
prbhas in doom-4?
prbhas in doom-4?

prbhas in doom-4?

రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమాల గురించి పర్ఫెక్ట్ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. అయినా రూమర్స్ మాత్రం ఆగడం లేదు. మరి ఈ వార్తల వెనక ఉద్దేశ్యం ఏంటో గానీ.. ప్రభాస్ ధూమ్ -4లో నటించబోతున్నాడు అనే వార్తను హిందీ మీడియా ఆపడం లేదు. అవన్నీ నిజమే అనుకుని తెలుగులోనూ వార్తలు రాస్తున్నారు చాలామంది. కానీ కాస్త తరచి చూస్తే ఆ సినిమాలో ప్రభాస్ నటించడం సాధ్యమా అంటే అస్సలు లేదు అనే చెప్పాలి. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో ఉన్న షూటింగ్ లే బంద్ అయిపోయాయి. కొత్తగా మళ్లీ ఎప్పుడు సెట్స్ లోకి వెళతారో ఎవరికీ అంచనాలు లేవు. పెద్ద సినిమాలకైతే అస్సలు లేదు. అయినా ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాను మేజర్ పార్ట్ పూర్తి చేయాల్సి ఉంది. ఇంకా చెబితే ఈ సినిమా కనీసం సింగిల్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకోలేదు. దీంతో పాటు వైజయంతీ మూవీస్ బ్యానర్ లో నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో సినిమా డిక్లేర్ చేశాడు. పైగా ఈ మూవీకి హీరోయిన్ ను కూడా లేటెస్ట్ గా అనౌన్స్ చేశారు. సో.. ప్రభాస్ ఇప్పుడు ముందుగా రెండు సినిమాలు పూర్తి చేయాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తోంటే ఈ రెండూ పూర్తవడానికి కనీసం రెండేళ్ల పై మాటే అనుకోవచ్చు.

అంటే 2022వరకూ ప్రభాస్ చాలా బిజీగా ఉంటాడు. ఒకవేళ 2021 చివర్లో కాస్త ఖాళీ అవుతాడు అనుకున్నా… అదంతా ఈ రెండు సినిమాల షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయి అనేదానిపైనే డిపెండ్ అయి ఉంటుంది. వరస చూస్తోంటే ఈ యేడాదంతా షూటింగ్స్ సజావుగా సాగేలా లేవు. అయినా ప్రభాస్ ధూమ్ -4లో నటిస్తున్నాడనీ.. లేదంటే వార్ మూవీ సీక్వెల్ లో యాక్ట్ చేస్తున్నాడని రకరకాల వార్తలు వస్తుండటాన్ని సిల్లీగానే భావించాలి తప్ప.. వాస్తవం అవుతాయి అనుకోలేం. మరోవైపు బాలీవుడ్ లో సైతం ఆ రెండు సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. అంటే నిర్మాణ సంస్థ, దర్శకుడు వంటి వ్వవహారాలేవీ వార్తల్లో లేవు. అంటే ఇది పూర్తిగా రూమర్ గానే భావించాల్సి ఉంది. ఏదేమైనా ప్రభాస్ మాత్రం రాధేశ్యామ్, నాగ్ అశ్విన్ సినిమాలతో పూర్తి భిన్నమైన కథలతో వస్తున్నాడు. ఈ రెండు సినిమాలపైనా పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉన్నాడతను. అంటే భారీ విజయాలు ఎక్స్ పెక్ట్  చేయొచ్చన్నమాట.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here