“PREMA PARICHAYAM” MOVIE STARTED
రజత్ రాఘవ్ హీరోగా నటిస్తున్న చిత్రం `ప్రేమ పరిచయం`. సిద్ధికా శర్మ, కరీష్మా కౌల్ నాయికలు. శివ.ఐ దర్శకుడు. ఎం. పెరుమాండ్లు నిర్మాత.
ప్రేమ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత పెరుమాండ్లు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. పారిశ్రామికవేత్త సుభాష్ రెడ్డి క్లాప్‌నిచ్చారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరక్టర్ మామిడి హరికృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. పెరుమాండ్లు మాట్లాడుతూ “తెలిసీ తెలియక యవ్వనంలో చేసిన పొరపాట్లు జీవితంపై చూపించే ప్రభావం కొన్నిసార్లు దారుణంగా ఉంటుంది. అసలు ప్రేమంటే ఏంటి? అనే అంశంతో రూపొందుతున్న చిత్రం మాది. యువతకు మంచి మెసేజ్ ఉంటుంది. ఈ నెల 11 నుంచి హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం“ అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ “రెండు హృదయాల మధ్య ప్రేమ పుట్టే వైనాన్ని చెప్పే సినిమా ఇది. ప్రకృతిని కూడా సీజీలో చూపిస్తాం. కొత్త టెక్నాలజీని వాడుతున్నాం. నిర్మాతకూ, నాకూ ఇద్దరికీ ఇదే తొలి సినిమా. నన్ను నమ్మి ఆయన అవకాశం ఇచ్చారు“ అని అన్నారు. మంచి పాత్రల్లో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని నాయకానాయికలు తెలిపారు.
టెక్నీషియన్స్:
సంగీతం: అగస్త్య, కెమెరా: మాదేశ్, ఎడిటర్: నందమూరి హరి, ప్రొడక్షన్ కంట్రోలర్: రవీందర్ బెక్కం.