చెత్తను ఏరిన ప్రధాని మోదీ.. నెటిజన్ల ప్రశంసలు

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ప్రధాని నరేంద్ర మోదీ స‍్వచ్ఛ భారత్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కాగా, స్వచ్ఛ భారత్‌లో భాగంగా నగరాలను శుభ్రంగా ఉంచాలని మోదీ పిలుపునిచ్చారు.

అయితే.. తాజాగా ప్రధాని మోదీ మరోసారి స్వచ్ఛ స్పూర్తిని చాటుకున్నారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీనే స్వయంగా చెత్త ఏరివేసి దేశ ప‍్రజలకు మరోసారి ‘స్వచ్ఛ భారత్‌’ సందేశాన్ని వినిపించారు. కాగా, మోదీ.. ఆదివారం ఢిల్లీలో నిర్మించిన ‘ప్రగతి మైదాన్‌ సమీకృత ట్రాన్స్‌పోర్ట్‌ టన్నెల్‌’ను ప్రారంభించారు. అనంతరం ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఐటీపీఓ టన్నెల్‌ను మోదీ పరిశీలించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article