కన్ను గీటి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన వింక్ గాళ్ గుర్తుంది కదా!అదే మన కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్ వారియర్.చాన్నాళ్ల తర్వాత ఈ ముద్దుగుమ్మకి అదిరిపోయే ఓ బంపర్ ఆఫర్ దక్కింది.పవన్ కళ్యాణ్ సినిమాలో ఆమె ఓ కీలక పాత్ర చేయబోతోంది.కన్నుగీటి ఫేమస్ అయ్యాక ఈ ముద్దుగుమ్మకి బాలీవుడ్ మొదలుకొని మన టాలీవుడ్ దాకా ఆఫర్లు వెల్లువెత్తాయి.పలు సినిమాల్లో నటించింది.తెలుగులో నితిన్ సహా పలువురు హీరోలతో కలిసి ఆడిపాడింది.కానీ అదృష్టం మాత్రం కలిసిరాలేదు.
ఇన్నాళ్ల తర్వాత మరో ఆఫర్ అందుకుంది ఈ అమ్మడు.పవన్‌కళ్యాణ్ కథానాయకుడిగా మలయాళంలో విజయవంతమైన `వినోదాయ సిద్ధం` రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ రోజే ఈ సినిమా మొదలైంది.ఇందులోనే ప్రియా ప్రకాశ్ వారియర్ ఓ కీలక పాత్ర చేయనుంది.ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన మరో హీరోయిన్ కూడా నటించనుంది. పవన్‌కి మాత్రం హీరోయిన్ ఉండదు. ఎందుకంటే ఆయన పోషిస్తున్నది దేవుడి పాత్ర.సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కొన్ని నెలల వ్యవధిలోనే ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి.త్రివిక్రమ్ స్క్రీప్ట్‌ని సిద్ధం చేశారు.