బ్రహ్మాస్త్రం బయటకు తీసిన కాంగ్రెస్

PRIYANKA COMING INTO DIRECT POLITICS

  • ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంకాగాంధీ
  • యూపీ తూర్పు విభాగానికి పార్టీ జనరల్ సెక్రటరీగా నియామకం

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. తన బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసింది. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సర్కారును ఓడించేందుకు చురుకుగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకగాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించింది. ఇప్పటి వరకు అడపాదడపా ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్న ఆమె ఇప్పుడు నేరుగా రాజకీయ అరంగేట్రం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌ తూర్పు భాగానికి ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీగా ఆమె నియమితులయ్యారు. యూపీ పశ్చిమ‌ భాగానికి ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీగా జ్యోతిరాదిత్య సింథియాను నియమించారు. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రియాంక గాంధీ తన బాధ్యతలను స్వీకరించనున్నారు. యూపీ తూర్పు ప్రాంతానికి బీజేపీ నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్టార్‌ క్యాంపెయినర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రియాంకను ఆయనకు వ్యతిరేకంగానే రంగంలోకి దించారు.

రాజకీయంగా యూపీ తూర్పు భాగం చాలా కీలకమైంది. ఈ నేపథ్యంలో ప్రియాంకకు ఆ బాధ్యతలు అప్పగించడం ద్వారా సాధ్యమైనన్ని సీట్లు గెలుచుకోవాలని కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. అచ్చం నాన్నమ్మ ఇందిరాగాంధీని మైమరపించే ప్రియాంకాగాంధీకి జనం బ్రహ్మరథం పట్టడం ఖాయమని, ఆమె సారథ్యంలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని పేర్కొంటున్నారు. కాగా, ప్రియాంక నియామకంపై రాహుల్ గాంధీ స్పందించారు. ఆమె శక్తివంతమైన నాయకురాలని కొనియాడారు. ప్రియాంక, జ్యోతిరాదిత్య సింధియాలు యూపీ రాజకీయాలను మార్చగలరని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.

NATIONAL UPDATES

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article