ప్రియాంక రాకతో కాంగ్రెస్ లో నయా జోష్

Priyanka Entry TO Congress … హర్షం వ్యక్తం చేస్తున్న టీ కాంగ్రెస్

రానున్న ఎన్నికల నేపధ్యంలో దేశ రాజకీయాల్లోకి మరో గాంధీ కుటుంబ వారసురాలు క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. మొన్నటి వరకు రాజకీయాలంటే ఆసక్తి చూపించని ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని గద్దె దించాలని ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రియాంకను రంగంలోకి దింపింది.
ప్రియాంక గాంధిని ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో ఆమె ఇక వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కీలకపాత్ర పోషిస్తుందనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ప్రియాంక నియామకంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు. ప్రియాంక గాంధీ క్రియాశీలక రాజకీయాల్లోకి రావడానికి మార్గం సుగమం చేస్తూ ఆమెను తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి ఏఐసీసీ కార్యదర్శిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించడంతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నానమ్మ ఇందిరాగాంధీ పోలికలు పుష్కలంగా ఉన్న ప్రియాంక రాజకీయాల్లోకి రావాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎప్పడ్నించో పట్టుపడుతున్నారు. లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తుండటం, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా యూపీ కీలకం కావడంతో కాంగ్రెస్ తాజా ప్రకటనతో ఆ పార్టీలో సంబరాలు మిన్నంటుతున్నాయి. ప్రియాంక గాంధిని ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధి నియమించడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. గాంధిభవన్‌లో సంబరాలు జరుపుకున్నారు. పార్టీ సినియర్ నేతలు గాంధిభవన్ ముందు టపాకాయలు పేల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. పార్టీ సీనియర్ నేత ఏఐసిసి కార్యదర్వి వి.హనుమంతరావు గాంధిభవన్ ముందు డ్యాన్స్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. మాజీమంత్రి మర్రి శశీధర్ రెడ్డి సంబరాల్లో పాల్గొని స్వీట్లు పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవ కోసం గాంధి కుటుంబం నుంచి ప్రియాంకగాంధి రావడం దేశానికి మేలు జరుగుతుందనే భావనను నేతలు వ్యక్తం చేశారు. ప్రియాంకా గాంధీ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించ‌డంతో ఏ స్థానం నుంచి ఆమె పోటీ చేస్తార‌న్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా సోనియాగాంధీ గతంలో మాదిరిగా రాజకీయాల్లో చురుకుగా పాల్గొనడం లేదు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని కూడా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోనియాగాంధీ నియోజకవర్గమైన రాయబరేలి నుంచే ప్రియాంకను ఎన్నికల బరిలోకి దింపితే ఆమె గెలుపు నల్లేరుమీద నడకే అవుతుందని పార్టీ సీనియర్ నేతలు అధిష్టానానికి సూచించినట్టు

Watch Latest Movie in Amazon prime
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article