రాయబరేలి నుండి పోటీలో ప్రియాంకా గాంధీ

PRIYANKA GANDHI Contestant from RAYABARELE

రానున్న ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీపై యుద్ధం చేయడానికి తన ఆస్తుల శాస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించి అధికారంలోకి రావడం అనివార్యమైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే భేషజాల ను వదిలి పెట్టి, పరిస్థితులను బట్టి తగ్గి, ప్రాంతీయ పార్టీలన్నిటి తో కలుపుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లాలని ప్రయత్నం చేస్తుంది. బిజెపి ఇతర కూటమిలో భాగస్వామ్యం తీసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో రాయబరేలి నుండి ప్రియాంక గాంధీని రంగంలోకి దించాలని నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ చెల్లెలు ప్రియాంకా గాంధీ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి ఎంట‌ర్ అయ్యారు. గతంలో ప్రత్యక్ష రాజకీయాలపై తనకు ఆసక్తి లేదంటూ కొట్టిపారేసినా ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత ప్రధని మోడీకి సరైనా ప్రజాకర్షణ గల రాజకీయ వేత్త ప్రియాంకాయేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించిన విషయం తెలిసిందే. కాగా ప్రియాంక గాంధీ ఏ స్థానం నుండి పోటీలో దిగనున్నది అందరిలోనూ ఉహాగానాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అయితే సోనియా గాంధీ నియోజకవర్గమైన రాయ్‌బ‌రేలీ ప్రియాంక గాంధీని బరిలో దింపే అవకాశం ఉందని వార్తాలు వినిపిస్తున్నాయి. అయితే యూపీలో కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రియాంకాతోనే దగ్గర సంబధాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ కన్నా ఎక్కువగా స్థానిక కార్యకర్తలు ప్రియాంక గాంధీతో అత్యంత సన్నిహితంగా ఉంటారని కొందరంటూన్నారు. చూడాలి ప్రత్యేక్ష రాజకీయాల్లో అడుగుపెట్టి ప్రియాంక ఏ విధంగా దూసుకెళ్తుందో చూడాలి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article