సోన్‌భద్ర కాల్పుల బాధిత కుటుంబాలను పరామర్శించిన ప్రియాంక

96
PRIYANKA GANDHI VISITED PHONE SONABDRA FAMILIES
PRIYANKA GANDHI VISITED PHONE SONABDRA FAMILIES

PRIYANKA GANDHI VISITED PHONE SONABDRA FAMILIES

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మిర్జాపుర్ జిల్లా సోన్‌భద్రలోని ఘోరావల్‌లో ఓ స్థలవివాదంపై బుధవారం చోటుచేసుకున్న గొడవలో పది మంది మృతి చెందారు.. గ్రామపెద్ద యగ్యాదత్‌ వర్గం, స్థానిక గిరిజనుల మధ్య వివాదం తలెత్తడంతో దత్‌ అనుచరులు కాల్పులు జరపగా పది మంది ఆదివాసీలు మృతిచెందారు. బాధిత కుటుంబాలను శుక్రవారం పరామర్శించేందుకు వెళ్ళిన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు అడ్డుకున్నారు. దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ నేతలతో కలిసి ఆమె రోడ్డుపై బైఠాయించారు. అనంతరం పోలీసులు ప్రియాంకను అదుపులోకి తీసుకుని గెస్ట్‌హౌస్‌కు తరలించారు. రాత్రంతా ఆమె అక్కడే ఉన్నారు .
దీంతో ప్రియాంక మొండితనానికి అధికారులు దిగరాకతప్పలేదు. శనివారం ఉదయం మరోసారి ప్రియాంకను కలిసిన అధికారులు బాధితులను కలవాలనే నిర్ణయాన్ని మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆమె మాత్రం ససేమిరా అన్నారు. వారిని కలవకుండా ఇక్కడ నుంచి వెళ్లేదిలేదని స్పష్టం చేశారు. ఒకవేళ బాధిత కుటుంబాలను పరామర్శించడానికి అనుమతించకపోతే వారిని కలవడానికి అనువైన ప్రదేశాన్ని అధికారులు సూచిస్తే తాను కలుస్తానని ప్రియాంక గాంధీ ఉద్ఘాటించారు. ప్రియాంక ప్రతిపాదనకు అంగీకరించిన అధికారులు బాధిత కుటుంబాలకు చెందిన 15 మందిని గెస్ట్‌హౌస్‌కు తీసుకొచ్చారు. అయితే, వీరిని కలవడానికి కూడా అనుమతించకపోవడంతో విషయం తెలుసుకున్న ప్రియాంక మరోసారి ధర్నాకు దిగారు. వారిని కలవడానికి అనుమతించాలని డిమాండ్ చేశారు.

అధికారులు చివరకు బాధిత కుటుంబాలను ప్రియాంక వద్దకు పంపారు. ఈ సమయంలో ప్రియాంకను చూడగానే బాధిత కుటుంబాలు బోరున విలపించారు. ప్రియాంక సైతం భావోద్వేగానికి గురయ్యారు. ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయని కాంగ్రెస్ నేత వివేకానంద్ పాఠక్ తెలిపారు. మరోవైపు, బాధిత కుటుంబాలను కలిసేందుకు వచ్చిన డేరక్ ఒబెరాయ్ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ బృందాన్ని వారణాసి విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. దుఃఖంలో ఉన్న కుటుంబాలను పరామర్శించడం తప్పా? ప్రియాంకను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ విమర్శించారు.

CHIRANJEEVI ILLEGAL POLITICIAN

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here