మోడీపై ప్రియాంక పోటీ … సాధ్యమేనా ?

Priyanka partcipating againast Modi

కాంగ్రెస్ పార్టీ నుండి వారణాసి ఎన్నికల బరిలో ప్రియాంక పోటీ చెయ్యనున్నారా ? మోడీతో ప్రియాంక తలపడనున్నారా ?కాంగ్రెస్ పార్టీ ఆ సాహసం చేస్తుందా అంటే లేదు అని చెప్పాలి. కానీ మోడీతో ప్రియాంక పోటీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ తూర్పు ప్రాంతం వ్య‌వ‌హారాల ఇన్‌చార్జీ ప్రియాంకా గాంధీకి సంబంధించిన ఓ అంశం ఇప్పుడు ఆసక్తిక‌రంగా మారిపోయింది. పార్టీ వ్వ‌వ‌హారాల‌కు చాలా కాలం నుంచి దూరంగానే ఉంటూ వ‌స్తున్న ప్రియాంక‌… ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా… త‌న త‌ల్లి సోనియా గాంధీ, సోద‌రుడు రాహుల్ గాంధీల నియోజ‌క‌వ‌ర్గాలు రాయ‌బ‌రేలీ, అమేథీల్లో ప్ర‌చారంతో స‌రిపెట్టేవారు. అయితే ఈ ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ పార్టీ… ప్రియాంకకు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.

ఇటీవల ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప్రియాంక‌… ఈ ద‌ఫా ప్ర‌త్య‌క్ష బ‌రిలోకి కూడా దిగ‌బోతోంద‌ని ఆమె భ‌ర్త‌, ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త రాబ‌ర్ట్ వాద్రా ప‌దే ప‌దే చెబుతూ వ‌స్తున్నారు. త‌న భార్య ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉంద‌ని చెప్పిన ఆయ‌న‌… ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై పోటీ చేసేందుకు ఏకంగా వార‌ణాసిలోనే ప్రియాంక పోటీ చేసేందుకు సిద్ధంగా ఉంద‌ని ప్ర‌క‌టించారు. ఎంతైనా భ‌ర్త క‌దా… త‌న భార్య ఎంత త్వ‌ర‌గా ఎంపీ అయిపోతే.. అంత త్వ‌ర‌గా కీల‌క ప‌దవిని కూడా పొంద‌వ‌చ్చ‌ని వాద్రా ఉబ‌లాట‌ప‌డ‌టంలో పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌మేమీ లేదనే చెప్పాలి.

అయితే వార‌ణాసిలో… అది కూడా బ‌ల‌మైన మోదీ లాంటి ప్ర‌త్య‌ర్థిపై ఆమెను బ‌రిలోకి దించేందుకు కాంగ్రెస్ పార్టీ సాహ‌సిస్తుందా? అన్న‌ది ఇప్పుడు అస‌లు సిస‌లు ప్ర‌శ్న‌గా మారింది. ఎందుకంటే… వార‌ణాసిలో ప్రియాంక పోటీకి దిగితే బాగానే ఉంటుంది… త‌న‌దైన ఛ‌రిష్మాతో మోదీని ఓడిస్తే ఇంకా బాగానే ఉంటుంది. అయితే ఒక‌వేళ మోదీ ప్ర‌భంజ‌నం ముందు ప్రియాంక ఓడిపోతే… జూనియర్ ఇందిరా గాంధీగా మంచి ప్ర‌జాద‌ర‌ణే ఉన్న ప్రియాంక‌ను తొలిసారే ఓడిపోయేలా చేస్తే… పార్టీకి ఇక భ‌విష్య‌త్తే ఉండ‌దు క‌దా. ఈ లెక్క‌న వాద్రా ఎంత ఉబ‌లాట‌ప‌డ్డా… ప్రియాంక పోటీకి, అది కూడా వార‌ణాసిలో పోటీకి కాంగ్రెస్ పార్టీ అంత ఈజీగా నిర్ణ‌యం తీసుకుంటుందా?

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article