రాజ్ భవన్ లో ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం

Pro Team Speaker sworn in

రాష్ట్ర శాసనసభ ప్రోటెం స్పీకర్ గా శ్రీ ముంతాజ్ అహ్మద్ ఖాన్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ దర్బార్ హాల్ లో సాయంత్రం 5 గంటలకు జరిగిన కార్యక్రమంలో శ్రీ ముంతాజ్ అహ్మద్ ఖాన్ తో గవర్నర్ శ్రీ ఇ.ఎస్.ఎల్ నరసింహన్ ప్రమాణం స్వీకారం చేయించారు. మొదట జాతీయ గీతం గీతాలాపన అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. అసెంబ్లీ సచివాలయ కార్యదర్శి ప్రోటెం స్పీకర్ నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ ను చదివి వినిపించారు. ప్రమాణం స్వీకారం చేసిన అనంతరం శ్రీ ముంతాజ్ అహ్మద్ ఖాన్ Oath Form పై గవర్నర్ సమక్షంలో సంతకం చేశారు. గవర్నర్ శ్రీ ఇ.ఎస్.ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ప్రోటెం స్పీకర్ శ్రీ ముంతాజ్ అహ్మద్ ఖాన్ గారికి పుష్పగుచ్ఛంతో అభినందనలు తెలిపారు.

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారు, శాసన మండలి ఛైర్మన్ శ్రీ స్వామిగౌడ్, హోం మంత్రి శ్రీ మహమూద్ అలీ, మాజీ స్పీకర్ శ్రీ మధుసూధనాచారి, పార్లమెంట్ సభ్యులు శ్రీ అసదుద్దీన్ ఓవైసీ , శ్రీ బి.వినోద్ కుమార్ , శ్రీ సంతోష్ కుమార్ , శాసనమండలి సభ్యులు శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రీ బి.వెంకటేశ్వర్లు , శ్రీ అమీన్ జాఫ్రీ, శాసన సభ సభ్యులు శ్రీ సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, శ్రీ మహ్మద్ మోజం ఖాన్ ,శ్రీ కౌసర్ మోహినుద్దీన్, శ్రీ అహ్మద్ బలాల, శ్రీ వి.శ్రీనివాస్ గౌడ్, శ్రీ కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి, జి.ఎ.డి. ముఖ్యకార్యదర్శి శ్రీ అధర్ సిన్హా, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ రామకృష్ణా రావు, డిజిపి శ్రీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ అంజనీ కుమార్ తదితర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర అసెంబ్లీ గురువారం నుండి ప్రారంభం కానుంది. ప్రోటెం స్పీకర్ నూతనంగా ఎన్నికైన గౌరవశాసన సభ్యులచే ప్రమాణస్వీకారం చేయిస్తారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article