రాజ్య సభ స్థానాల భర్తీకి షెడ్యూల్…

124
Probables of Rajya Sabha Seats 2020
Probables of Rajya Sabha Seats 2020

Probables of Rajya Sabha Seats 2020

రాజ్య సభ స్థానాల భర్తీకి  ప్రకటన వచ్చేసింది . ఏప్రిల్‌లో ఖాళీ అవనున్న 55రాజ్య సభ సీట్ల కోసం మార్చి 26న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల కమిషన్ మంగళవారం ప్రకటన జారీ చేసింది. 17రాష్ట్రాల్లోని పలు స్థానాల్లో ఉన్న ఎంపీల పదవీ కాలం ఏప్రిల్ నెలలో తేదీలను బట్టి ముగియనుంది. ’17రాష్ట్రాల్లో ఉన్న 55 రాజ్యసభ స్థానాలు పదవీ కాలం ఏప్రిల్ నాటికి ముగియనుంది. వాటిని భర్తీ చేసేందుకు మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి’ అని ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. ఎలక్షన్ షెడ్యూల్ వివరాల ప్రకారం.. మార్చి 6న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. మార్చి 13నాటికి నామినేషన్స్ ప్రక్రియ ముగియాల్సి ఉంది. మార్చి 26న ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకూ ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు సాయంత్రం 5గంటలకు ఓట్లను లెక్కిస్తారు.  ఇక ఏపీ నుంచి ఎమ్.ఏ ఖాన్, సుబ్బిరామిరెడ్డి, కేశవరావు, తోట సీతారామలక్ష్మి లు, అలాగే తెలంగాణ  నుంచి కేవీపీ, గరికపాటి మోహన్ రావు  రిటైర్ కానున్నారు.

Probables of Rajya Sabha Seats 2020,rajyasabha seats, schedule, notification , 17 states , 55 seats , andhra pradesh, telangana

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here