భాగ్యనగరి ప్రేమికులకు ఇన్ని కష్టాలా

Problems for Hyderabad Lovers

సృష్టిలో అనిర్వచనీయ అనుభూతికి కారణం అయింది ప్రేమ. రెండు అక్షరాలే అయినా ప్రేమ లేకుండా సమస్త జీవకోటి మనుగడ లేదు. అలాంటి ప్రేమకు చిహ్నంగా జరుపుకునే ప్రేమికుల రోజు నేడు.. ఇక ప్రేమ పక్షులు చాలా ప్రత్యేకంగా భావించే ప్రేమికుల దినోత్సవం ప్రేమికులకు కష్టాలు తెచ్చింది.. అయితే ప్రేమ జంటలు కనిపిస్తే పెళ్లి చేస్తామని ఒకపక్క బజరంగ్ దళ్ హెచ్చరిస్తుంది. మరోపక్క హైదరాబాద్లోని పార్క్ ల వద్ద యువత ఎక్కువగా సంచరించే ప్రదేశాలలో షీ టీమ్స్ నిఘా పెట్టారు పోలీసులు. ప్రేమికుల రోజున రైతుల ప్రేమించుకుందాం అనుకున్నా ప్రేమ పక్షులకు నిర్బంధ వాతావరణం కనిపిస్తోంది.

ప్రేమికుల దినోత్సవం..నగరం సిద్ధమైంది. లవర్స్ కూడా సిద్ధమయ్యారు. అయితే..వీరిని అడ్డుకోవడానికి కొన్ని సంఘాలు రెడీ అయ్యాయి. పార్కుల్లో కనపడినా…ఎక్కడ ప్రేమికులు కనబడితే వారిని అడ్డుకుంటామని..పెళ్లిళ్లు చేసేస్తామని సంఘాలు హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రధానంగా షీ టీమ్స్ రంగంలోకి దిగుతున్నాయి. యువత ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో షీ టీమ్స్ భద్రతను పర్యవేక్షించనున్నాయి.

గతంలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పోలీసులు పార్కులను మూసివేసిన సంగతి తెలిసిందే. ఇందిరాపార్కు, నెక్లెస్ రోడ్డు, పీపుల్స్ ప్లాజా, పబ్లిక్ గార్డెన్ తదితర కీలక ప్లేస్‌లలో నిఘా ఉంచేందుకు సిద్ధమయ్యారు. అంతేగాకుండా ఐస్ క్రీం పార్లర్లు, పబ్‌లు, రెస్టారెంట్ల వద్ద నిఘా ఉంచనున్నారు. ఎవరైనా ప్రేమికులను అడ్డుకుంటే వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొంటున్నారు. ప్రేమికుల దినోత్సవం రోజున ఫాదర్స్..మదర్స్ కూడా పిల్లలపై దృష్టి పెట్టాలని పోలీసులు సూచిస్తున్నారు.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article