కంగనా రనౌత్ ను కూడా పంపిస్తారా..?

19
problems for kangana
problems for kangana

problems for kangana

కంగనా రనౌత్.. ప్రస్తుతం బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా దూసుకుపోతోంది. వరుస విజయాలు కూడా ఉండటంతో అమ్మడి ట్వీట్ కు అడ్డే లేకుండా పోయింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య(..?) తర్వాత ఇంక బాలీవుడ్ మాఫియా అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోతోంది. గతంలో దేవుడు, రాముడు, హిందువులు అంటూ తెగ మాట్లాడింది కాబట్టి.. ఇప్పుడు తనకు బిజెపి మద్ధతుతో పాటు ఆ పార్టీ నాయకుల అండ కూడా దొరికింది. ఇంకేం.. తను ఏం చెప్పినా సెన్సేషన్ చేసేందుకు మీడియా.. సోషల్ మీడియా సిద్ధంగా ఉంది. అందుకే అడ్డూ అదుపూ లేకుండా బాలీవుడ్ ను ఓ ఆట ఆడుకుంటోంది. తన ధాటికి చాలా పెద్ద స్టార్లు కూడా అన్నీ మూసుకుని కూర్చున్నారు. ఏకొందరో తప్ప పెద్దగా స్పందించడం లేదు. ఇక కొన్ని రోజుల క్రితం ఈ గొడవలోకి మహరాష్ట్ర ప్రభుత్వాన్ని లాగింది. పైగా ముంబైని మరో పివోకే(పాక్ ఆక్రమిత కశ్మిర్) అంటూ సంబోధించి.. అప్పటి వరకూ కూడగట్టుకున్న మద్దతులో సగం కోల్పోయింది. ప్రస్తుతం ఈ గొడవలో మహరాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయింది. ఆ మాట అన్నదనే కారణంతో ముంబైలోని కంగనా ఆఫీస్ ను నిబంధనలకు విరుద్ధంగా ఉందని కూల్చేశారు.

ఇక ఇప్పుడు మరో కొత్త షాక్ తగిలిందీ క్వీన్ కు. తను నటిస్తోన్న తేజస్ సినిమాకు గ్రేట్ ఇండియన్ సినిమాటోగ్రాఫర్ గా ఉన్న పిసి శ్రీరామ్ ను తీసుకున్నారు. కానీ ఆయన నిన్న ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు ట్విట్టర్ లో తెలియజేశాడు. ఈ సినిమాలో కేవలం కంగనా రనౌత్ నటిస్తున్నందువల్ల అసౌకర్యానికి గురై మాత్రమే తప్పుకున్నానని చెప్పడం విశేషం. అయితే ఈ ట్వీట్ కు కంగనా కూడా రియాక్ట్ అయింది. ‘మీతో వర్క్ చేసే అవకాశం కోల్పోయినందుకు బాధపడుతున్నా’అనే ధోరణిలో కాస్త కామ్ గానే రిప్లై ఇచ్చింది. దీనికి పిసి శ్రీరామ్ కూడా ‘మచ్ అప్రిసియేషన్స్’అని రిప్లై ఇచ్చాడు. మొత్తంగా మొన్న ఆమె ట్విట్టర్ ఫాలోవర్స్ చాలామంది తగ్గారు. ఇప్పుడు పిసి శ్రీరామ్ తప్పుకున్నాడు. ముంబైలో ఆఫీస్ కూల్చేశారు. ఇకపై తన సినిమాలకు బాలీవుడ్ లో గడ్డు పరిస్థితులు రాబోతున్నాయా..? ఈ ‘అవుట్ సైడర్’ను అవుటాఫ్ బాలీవుడ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే చర్చలు మాత్రం జోరుగా సాగుతున్నాయి.

bollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here