తెలంగాణా కాంగ్రెస్ కో బచావో

Problems in Telangana Congress

సర్వే సంచలనం .. ఉత్తమ్ కో హటావో ..

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ లో ముందస్తు ఎన్నికల్లో ఓటమి పాలైనా నాయకుల్లో బుద్ధి రాలేదు. పార్టీ లో సీనియర్ నాయకులు వేదికల మీద తన్నుకు చస్తున్నారు. బాహాటంగా సవాళ్లు చేసుకుంటున్నారు. వివాదాస్పదంగా మారుతున్నారు. పార్టీ పరువు తీస్తున్నారు.
ఒక పక్క పార్లమెంట్ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. గత ఎన్నికల్లో ప్రజాకూటమి పొత్తులతో పోటీ చేసినా చావు దెబ్బ తింది కాంగ్రెస్ పార్టీ . ఇక ఇప్పుడైనా పార్లమెంట్ ఎన్నికలపై సీరియస్ గా పని చేస్తున్నారా అంటే అదేమ లేదు అని అనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి నువ్వంటే నువ్వు కారణం అంటూ కొట్టుకు చస్తున్నారు కాంగ్రెస్ నాయకులు . ఇక తాజాగా మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశం జరిగింది. అందులో గత ఎన్నికల్లో కంటోన్మెంట్ నుండి పోటీ చేసి ఓటమి పాలైన సర్వే సత్యన్నారాయణ ఉత్తమ్ కుమార్ రెడ్డి పై , కుంతియా పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఊరుకోక పార్టీ నేత కిషన్ పై వాటర్ బాటిల్ విసిరారు. నోటికొచ్చినట్టు తిట్టారు. దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు .
ఇక ఈ నేపధ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. తనపై క్రమశిక్షణాపరమైన చర్య తీసుకోవాలంటే హైకమాండ్‌కే అధికారం ఉందన్నారు.సోనియా,రాహుల్ లేదంటే ఏకే ఆంటోనీకే తనపై చర్య తీసుకునే అధికారం ఉందని సర్వే తెలిపారు. కేవలం నిలదీసినందుకే తనను టార్గెట్ చేశారని, వారి వల్లే పార్టీ నష్టపోయిందని సత్యనారాయణ అన్నారు. ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ పదవుల్లో ఉన్నవారు రాజీనామా చేయడం కాంగ్రెస్ పార్టీలో ఆనవాయితీగా వస్తోందన్నారు. గాంధీ కుటుంబానికి తాను విధేయుడినని, తనకు రాజకీయ జన్మ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అని ఆమె కోసం చావడానికైనా సిద్ధమని సర్వే ప్రకటించారు.
ఎన్నికల్లో ఓడించేందుకు ఉత్తమ్ కుట్రలు చేశారని, ఎన్నికల ఖర్చు కోసం పార్టీ నిధులు విడుదలు చేసిందని, దానితో పాటు టీపీసీసీ సైతం డబ్బు వసూలు చేసిందని ఆయన తెలిపారు. తనకు మందీమార్బాలం ఉందని, రౌడీయిజం, దాదాగిరి తాను చేయగలనని సర్వే హెచ్చరించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నాయకత్వంపై రాష్ట్రంలో చాలా మంది కార్యకర్తలు, నేతలు వ్యతిరేకతతో ఉన్నారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యానారాయణ.హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన టీఆర్ఎస్ పార్టీతో ఉత్తమ్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని, భట్టిని సైతం ఓడించేందుకు ఉత్తమ్ కుయుక్తులు పన్నారని ఆరోపించారు. . దారినపోయే దానయ్యలకు జనరల్ సెక్రటరీ, సెక్రటరీ పదవులు కట్టబెట్టారని దుయ్యబట్టారు.
నిన్నటి సమావేశంలో తనపై దాడి చేసేందుకు ప్రయత్నించిన వారిని ఉత్తమ్ కుమార్ వారించలేదని తెలిపారు. పూటకు గడవని వాళ్లను జనరల్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలుగా నియమించుకుని ఉత్తమ్ పెత్తనం చెలాయిస్తున్నారని సర్వే ఎద్దేవా చేశారు.ఆయన నాయకత్వంలో చాలామందికి అన్యాయం, అవమానం జరిగిందన్నారు. తాను కేవలం ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌నేనని, ఇంకా చాలామంది బ్యాట్స్‌మెన్లు వస్తారని సత్యనారాయణ జోస్యం చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి హఠావ్.. తెలంగాణ కాంగ్రెస్ బచావ్’’ అంటున్నారని కార్యకర్తలు తనకు మద్ధతుగా నిలుస్తున్నారి సర్వే తెలిపారు. మొత్తానికి కాంగ్రెస్ లో సర్వే వివాదం రచ్చ రచ్చగా మారుతోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article