మ‌హేష్ కోసం నిర్మాత‌ల కండీష‌న్‌

PRODUCERS CONDITON FOR MAHESH
సూప‌ర్‌స్టార్ మ‌హేష్ 25వ చిత్రం `మ‌హ‌ర్షి`లో చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. వంశీ పైడిప‌ల్లి డైరెక్ట‌ర్‌గా అశ్వినీద‌త్‌, దిల్‌రాజు, పివిపి నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుద‌ల కానుంది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల కోసం ఫ్యాన్సీ ఆఫ‌ర్‌తో ప‌లు సంస్థ‌లు పోటీ ప‌డ్డాయి. అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ రేటు చెల్లించి హ‌క్కుల‌ను ద‌క్కించుకుంది. సాధార‌ణంగా సినిమా విడుద‌లైన  30 రోజుల త‌ర్వాత సినిమాను సద‌రు డిజిట‌ల్ ఛానెల్లో ప్ర‌సారం చేసుకోవ‌చ్చు. అయితే మ‌హ‌ర్షి విష‌యంలో మాత్రం నిర్మాత‌లు సినిమాను 50 రోజుల త‌ర్వాతే ప్ర‌సారం చేయాల‌నే కండీష‌న్ పెట్టి అమెజాన్ సంస్థ‌కు అప్ప‌గించార‌ని స‌మాచారం. మ‌హేష్ స‌ర‌స‌న పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article