కోదండరాం గెలుపు చాలా అవసరం

42
Professior Kodandam ram will contest MLC
Professior Kodandam ram will contest MLC

Professior Kondandaram will contest MLC

రాష్ర్టంలో త్వరలో పట్టభద్రుల కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇందులో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుంది. తెలంగాణ ఉద్యమం కోసం కోదండరాం ఎంతో కష్టపడ్డారు. అయితే కోదండరాం కి వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గ అభ్యర్ధిగా మద్దతు ఇవ్వాలి అంటూ తెలంగాణ జన సమితి ప్రతి పక్ష పార్టీ నేతలను కూడా కోరింది. ఇందుకు ప్రతిపక్షాలు కూడా సానుకులంగా స్పందించినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీలకు టీజేఎస్‌ లేఖలు పంపింది. కోదండరాం గెలుపు అవసరమని నిరుద్యోగులు, యువత ఆశిస్తున్నారని, ప్రస్తుత పరిస్థితులపై మండలిలో గొంతెత్తే నాయకుడిని గెలిపించాలని టీజేఎస్‌ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ బాధ్యులు జి.వెంకట్‌రెడ్డి, ధర్మార్జున్, బైరి రమేశ్, శ్రీశైల్‌రెడ్డి కోరారు. ఎమ్మెల్సీగా కోదండరాం పోటీ చేయడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. దీంతో ఎమ్మెల్సీని ఎలాగైనా కైవం చేసుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. తెలంగాణ మేధావులు, యువత, నిరుద్యోగులు మాత్రం కోదండరాం గెలుపును గట్టిగా కోరుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here