అదేపనిగా సోషల్ మీడియా.కుంగుబాటు తప్పదయా

Intentional promoting in social Media

· సామాజిక మాధ్యమాలు ఎక్కువగా వాడితో డిప్రెషన్

· బాలుర కంటే బాలికలకే ముప్పు అధికం

· తాజా అధ్యయనంలో వెల్లడి

చేతిలో స్మార్ట్ ఫోన్.. అందులో వాట్సాప్, ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా యాప్స్.. ఇక ఎక్కడున్నా వాటిపైనే దృష్టి. గంటల తరబడి చాటింగ్, బ్రౌజింగ్.. ఇదీ నేటి యువత తీరు. రోడ్డుపై నడుస్తున్నా, బస్సులో ప్రయాణిస్తున్నా, చివరకు సినిమాకు వెళ్లినా స్మార్ట్ ఫోన్లపై వారి చేతి వేళ్లు నాట్యమాడుతూనే ఉంటాయి. ముఖ్యంగా టీనేజర్లు అయితే, అడ్డూ అదుపూ లేకుండా స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు. అయితే, ఇలా అధికంగా సోషల్ మీడియాను ఉపయోగించడం అస్సలు మంచిది కాదని, దీనివల్ల తీవ్రమైన డిప్రెషన్ కు గురయ్యే ప్రమాదం ఉందని తాజా పరిశోధనలో తేలింది. పైగా ఈ సమస్య మైనర్ బాలురు కంటే మైనర్ బాలికల్లో రెండు రెట్లు అధికంగా ఉంటుందని వెల్లడైంది. సామాజిక మాధ్యమాలను అధికంగా వినియోగిస్తే ఏమి జరుగుతుందనే అంశంపై బ్రిటన్ లోని యూనివర్సిటీ కాలేజ్ లండన్ కు చెందిన పరిశోధనలు అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా దాదాపు 11వేల మంది యువతీ యువకులు, బాలబాలికల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఇందులో పలు ఆశ్చర్యకర ఫలితాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాను వినియోగిస్తున్నవారిలో 14 ఏళ్ల లోపు బాలికలే అధికంగా ఉన్నట్టు తేలింది. ప్రతి ఐదుగురు బాలికల్లో ఇద్దరు, ప్రతి ఐదుగురు బాలురలో ఒకరు రోజుకి మూడున్నర గంటల కన్నా అధిక సమయం సామాజిక మాధ్యమాల మీదే గడుపుతున్నారు. బాలికల్లో కేవలం 4 శాతం మంది మాత్రమే వీటికి దూరంగా ఉండగా.. బాలురలో 10 శాతం మంది వీటిని కన్నెత్తి చూడటంలేదు. మొత్తం 12 శాతం మంది సామాజిక మాధ్యమాలకు తక్కువ సమయం కేటాయిస్తుండగా, 38 శాతం మంది ఐదేసి గంటల కన్నా అధికంగా వీటిని వినియోగిస్తున్నారు. ఇలా అధికంగా సోషల్ మీడియాలో మునిగిపోతున్నవారంతా తీవ్ర మానసిక కుంగుబాటుతో బాధపడుతున్నట్లు పరిశోధకులు తెలిపారు. పైగా బాలుర కంటే బాలికల్లో కుంగుబాటు లక్షణాలు అధికంగా కనబడుతున్నట్టు చెప్పారు. రోజులో గంట కన్నా అధికంగా వీటిని వినియోగిస్తామని చెప్పిన బాలికల్లో ఈ లక్షణాలు ఉన్నట్లు తేలిందని వెల్లడిచారు. రోజుకి మూడు గంటల కన్నా అధికంగా వీటిని వినియోగిస్తున్న బాలురలోనూ ఈ లక్షణాలు ఉన్నట్టు వివరించారు. ఇక బాలికల్లో 40 శాతం మంది, బాలురలో 28 శాతం మంది నిద్ర సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article