నేడు నింగిలోకి దూసుకుపోనున్న పీఎస్‌ఎల్వీ సీ 4

PSLV C4 Launched Successfully

పీఎస్‌ఎల్వీ సీ 44 ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఏర్పాట్లు పూర్తి చేసింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ రాత్రి 11 గంటలా 37 నిముషాలకు ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ నిన్న రాత్రి 7 గంటలా 37 నిముషాలకు మొదలైంది. మొత్తం 28 గంటల పాటు కౌంట్‌డౌన్‌ కొనసాగిన తర్వాత ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. కొత్త యేడాదిలో మరో సరికొత్త ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. ఈ రాత్రి చీకట్లను చీల్చుకుంటూ పీఎస్‌ఎల్వీ సీ 44 రాకెట్‌ను ప్రయోగించనుంది భారత అంతరిక్ష కేంద్రం. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈ యేడాది ఇస్రోకు బిగ్‌ ఇయర్‌ అని చంద్రయాన్‌ను కూడా ఇదే యేడాది ప్రయోగిస్తామని ఛైర్మెన్‌ శివన్‌ వెల్లడించారు. భారత రక్షణ, పరిశోధన సంస్థ డీఆర్‌డీవోకు సంబంధించిన ఇమేజింగ్ శాటిలైట్ మైక్రోశాట్ ఆర్‌ తో పాటు చెన్నై విద్యార్థులు రూపొందించిన కలాం శాట్ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ సీ 44 ద్వారా ఇస్రో నింగిలోకి పంపనుంది. ప్రయోగించిన 13 నిమిషాల తర్వాత 277 కిలోమీటర్ల ఎత్తులో మైక్రోశాట్ ఆర్ ఉపగ్రహం వాహకనౌక నుంచి వేరుపడుతుంది. పీఎస్‌ఎల్వీ ప్రయోగాన్ని నాలుగు దశల్లో చేపట్టనున్నారు. సాధారణంగా పీఎస్‌ఎల్వీ మొదటి దశలో ఆరు స్ట్రాపాన్ బూస్టర్లను వినియోగిస్తారు. కానీ ఈ ప్రయోగంలో కేవలం రెండు స్ట్రాపాన్ బూస్టర్లనే వాడారు. దీంతో దీన్ని పీఎస్‌ఎల్వీ- డీఎల్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ తరహా రాకెట్‌ను ఇస్రో ఉపయోగిస్తుండడం ఇదే తొలిసారి. ప్రయోగంలో బరువును తగ్గించి, పరిమాణాన్ని పెంచేందుకు తొలిసారి నాలుగోదశలో అల్యూమినియం ట్యాంక్‌ను వినియోగిస్తున్నట్లు ఇస్రో వర్గాలు వెల్లడించాయి. దీంతో వాహకనౌకలోని పీఎస్ నాలుగో దశను పలు పరిశోధనలకు మళ్లీ వినియోగించుకునేలా దాన్ని అంతరిక్షలోనే ఉంచనున్నారు. కొత్త యేడాదిలో తొలి ప్రయోగం నిర్వహిస్తున్నామని పీఎస్‌ఎల్వీ సీ 44 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావాలని కోరుకుంటూ ఇస్రో ఛైర్మెన్ శివన్‌ ఈ తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఈ యేడాది చంద్రయాన్‌తో కలుపుకొని మొత్తం 35 రాకెట్లను ఇస్రో నింగిలోకి పంపనుందని చరిత్రలో ఈ యేడాది ఒక‌ బిగ్ ఇయర్ గా నిలవబోతోందని శివన్‌ వెల్లడించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article