పర్యావరణ గణపతులకు జై కొట్టిన జనం

52
Public buying Eco Friendly Ganapatis
Public buying Eco Friendly Ganapatis

హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణలో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఎ) గురువారం వరకు 70 వేల వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేసింది. రాష్ట్ర సచివాలయంలో సెక్రెటరీ సోమేష్ కుమార్ గారికి తొలి గణపతి విగ్రహాన్ని స్పెషల్ సిఎస్, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీ అరవింద్ కుమార్ అందజేసి మట్టి గణపతి విగ్రహాల పంపిణీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత జంటనగరాలలోని పలు ప్రాంతాల్లో హెచ్ఎండీఏ ఉద్యోగులు ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు.

గురువారం తెలంగాణ హైకోర్టు లో ఉద్యోగులకు హెచ్ఎండీఏ అధికారులు మట్టి గణపతులు అందజేశారు. హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయం (అమీర్ పేట్) లో ఎస్టేట్ ఆఫీసర్ గంగాధర్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీమతి విజయలక్ష్మి, ల్యాండ్ అక్విజేషన్ ఆఫీసర్ శ్రీమతి ప్రసూనాంబ, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీమతి పరంజ్యోతి తదితరులు ఉద్యోగులకు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. నానక్ రామ్ గుడ లోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్.జి.సి.ఎల్) లో హెచ్ఎండిఎ సెక్రెటరీ సంతోష్ ఐఏఎస్, అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ డాక్టర్ ప్రభాకర్ ఐఎఫ్ఎస్ ఉద్యోగులకు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here