తిరుపతి చైనీయులకు కరోనా టెస్టులు…

Public Demands Corona Tests For Tirupathi Chinees

రోజు రోజుకు కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో  విస్తరిస్తోన్న క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అందరిలో భయం పెరిగిపోతోంది. ఇప్పటికే ఈ వైరస్ 26 దేశాలకు విస్తరించడం ఆందోళనకు కారణం అవుతుంది .  ఈ వైరస్ సోకిన వారిలో దాదాపుగా 500మంది మృత్యువాత పడటం, వేల మందికి పాజిటివ్ లక్షణాలు ఉండటం, ఇంకా విరుగుడును కనుక్కోకపోవడంతో అందరూ భయపడుతున్నారు. కరోనా లక్షణాల్లో ఏ లక్షణం కనిపించినా.. వెంటనే ఆసుపత్రులకు వెళ్లి టెస్టులు చేయించుకుంటున్నారు.  చైనా అన్నా, చైనీయులు అన్నా సరే ఆమడ దూరం పారిపోతున్నారు. ఈ నేపథ్యంలో తమ ప్రాంతాల్లో చైనీయులకు వైద్య పరీక్షలు చెయ్యాలని కోరుతున్న వారు కూడా లేకపోలేదు . తాజాగా తమ ప్రాంతంలో ఉంటోన్న చైనీయులకు కరోనా వైద్య పరీక్షలు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు తిరుపతి వాసులు. అయితే వారి విఙ్ఞప్తిని అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. తిరుచానూరు, దామినేడు ప్రాంతాల్లోని పలు అపార్ట్ మెంట్‌లలో చైనీయులు  ఉంటున్నారు. ఇక వారిని చూస్తేనే భయపడుతున్న వారు వారికి కరోనా పరీక్షలు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. వారు ఇక్కడే నివాసం ఉంటున్నపటికీ వారికి ఈ వైరస్ సోకిందేమో అని అనుమానాలు వ్యక్తం చెయ్యటంతో చైనీయుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కరోనా వైరస్ వల్ల వారు వివక్షను ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది.

Public Demands Corona Tests For Tirupathi Chinees,andhrapradesh , tirupathi

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article