పూజాహెగ్డేకు సినిమా పరిశ్రమపై బాధ్యత లేదా..?

43
puja hegde
puja hegde

puja hegde

అసలే కరోనా.. ఓ వైపు షూటింగ్ లు బంద్ అయ్యాయి. మరోవైపు ఆల్రెడీ చేసిన సినిమాలు విడుదల సాధ్యం కాదు. ఒక రకంగా సినిమా ఇండస్ట్రీ అంతా ఓ స్తబ్ధత ఉంది. రాబోయే రోజుల్లో పరిశ్రమ మనుగడ కూడా చాలా కష్టంగా ఉంటుంది. అందుకే నిర్మాతలను ఆదుకునేందుకు అన్ని పరిశ్రమల్లోనూ స్టార్స్ అంతా తమ రెమ్యూనరేషన్స్ లో స్వయంగా కోతలు మొదలుపెట్టారు. తెలుగులో ఇంకా ఏ స్టారూ ఈ విషయంలో ముందుకు రాలేదు. అయితే తగ్గించడం సంగతి పక్కన బెడితే ఈ జిగేల్ రాణి మాత్రం ఇంకా పెంచిందట. దీంతో అమ్మడిపై కొందరు ట్రోల్స్ మొదలుపెట్టారు. పూజా హెగ్డే ముకుంద సినిమాతో తెలుగులో పరిచయం అయింది. ఆ తర్వాత కూడా ఒక లైలా కోసం అనే సినిమా చేసింది. ఈ రెండు సినిమాలూ తనకు పెద్దగా ప్లస్ కాలేదు. కానీ దువ్వాడ జగన్నాథమ్ లో వేసిన బికినీతో పూజా రేంజ్ మారింది. ఆ సినిమా ఆశించినంత పెద్ద హిట్ కాకపోయినా పూజా సోయగాలకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. కట్ చేస్తే తెలుగులో టాప్ స్టార్స్ అంతా తనే కావాలని మొదలుపెట్టారు. ఎన్టీఆర్ తో అరవింద సమేత, అల్లు అర్జున్ తోనే రెండోసారి.. అల వైకుంఠపురములో అంటూ భారీ హిట్స్ అందుకుంది. మధ్యలో వరుణ్ తో మరోసారి గద్దలకొండ గణేశ్ లో మెరిసింది. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా వెలుగుతోంది పూజాహెగ్డే. ప్రభాస్ సరసన రాధేశ్యామ్ చేస్తోంది.

ఇటు కుర్ర హీరో అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లోనూ తనే. మరోవైపు బాలీవుడ్ లోనూ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కొన్నాళ్లుగా అందర్లానే షూటింగ్ లు లేక ఇంట్లోనే ఉంటోన్న ఈ బుట్టబొమ్మకు డిమాండ్ మాత్రం అస్సలు తగ్గలేదు. దీంతో ఆ డిమాండ్ ను క్యాష్ చేసుకునేందుకు కరోనా టైమ్ లో కూడా ఏ మాత్రం మొహమాట పడటం లేదట.. అందుకే తన రెమ్యూనరేషన్ పెంచింది అంటున్నారు. అల వైకుంఠపురములో, రాధేశ్యామ్ వరకూ పూజా రెమ్యూనరేషన్ కోటిన్నర వరకూ ఉందట. కానీ ఇప్పుడు తన వద్దకు వచ్చే నిర్మాతలను ఏకంగా రెండు కోట్లు అయితేనే చేస్తా అంటూ ఖచ్చితంగా చెబుతోందంటున్నారు. కీర్తి సురేష్, సాయి పల్లవి వంటి హీరోయిన్లు ఇప్పటికే తమ రెమ్యూనరేషన్ తగ్గించుకుంటున్నాం అని చెప్పారు. కానీ ఈ నార్త్ బ్యూటీ మాత్రం నా ఇష్టం అన్నట్టుగా ఇంకా పెంచేసి మరీ షాక్ ఇస్తోంది. మరి పూజా రెమ్యూనరేషన్ విషయంలో వస్తోన్న వార్తలు నిజమా కాదా అనేది కూడా తనే క్లారిటీ ఇస్తే ఇంకా మంచిది.. మొత్తంగా ఇలాంటి టైమ్ లోనే కదా.. ఇండస్ట్రీకి నిజమైన ఆప్తులు అనేది తేలిపోయేది.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here