పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి రషీద్ హతం

PULWAMA MASTER MIND KILLED

  • మరో ఇద్దరు ఉగ్రవాదుల్నీ మట్టుబెట్టిన భారత బలగాలు

పుల్వామా ఉగ్రదాడికి పాల్పడినవారిపై భారత భద్రతా దళాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. ఆ దాడికి కీలక సూత్రధారిగా ఉన్న జైషే మహ్మద్ కమాండర్ రషీద్ ఘాజీని మట్టుబెట్టాయి. సోమవారం ఉదయం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు జరిగిన కాల్పుల్లో ఘాజీ హతమయ్యాడు. పుల్వామా జిల్లాలోని పింగ్లాన్ ప్రాంతంలో ఓ ఇంట్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న భారత బలగాలపై వారు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన మన బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి. ఈ కాల్పుల్లో ఘాజీతోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో మన సైన్యానికి చెందిన మేజర్ తోపాటు మరో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. (పుల్వామా జిల్లాలో ఉగ్ర కాల్పులు)

NATIONAL NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article