పంజాబ్ సీఎం కొవిడ్ నజరానాభారతదేశంలోని ప్రతి రాష్ట్రం కరోనా నుంచి తమ ప్రజల్ని కాపాడుకునేందుకు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కరోనా కాటు వల్ల తల్లీదండ్రులు మరణించి.. అనాథగా మారిన చిన్నారులకు రూ.10 లక్షలు ఫిక్సడ్ డిపాజిట్ చేస్తామని వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, ఇలాంటి వినూత్న ఆలోచన పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ చేశారు. తమ గ్రామాల నుంచి కరోనాను తరమికొట్టేందుకు సరికొత్త నజరానా ప్రకటించారు. వంద శాతం వ్యాక్సీన్ పూర్తయ్యే ప్రతి గ్రామానికి ప్రత్యేక అభివ్రుద్ధి గ్రాంట్ కింద రూ.10 లక్షలను అందజేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కరనా ముక్త్ పిండ్ అభియాన్ కింద ప్రత్యేక నిధుల్ని అందిస్తామని తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article