వైసీపీతో పొత్తుపై పురంధరేశ్వరి ఏమన్నారంటే

Purandeswari Gives Clarity On YCP-BJP Alliance

ఏపీ సీఎం వైఎస్ జగన్ వరుస ఢిల్లీ  పర్యటనకు వెళ్లినప్పటి నుంచి వైసీపీ త్వరలోనే ఎన్డీఏ సర్కార్‌లో చేరుతుందనే ప్రచారం జరిగింది. ఇక దీనిపై నేతల విమర్శలు , ప్రతివిమర్శలు , అభిప్రాయాలు రకరకాలుగా వ్యక్తం అయ్యాయి . దీంతో, ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.. ఇప్పటికే బీజేపీ నుంచి దీనిపై క్లారిటీ వచ్చేసినా తాజాగా వైసీపీ, బీజేపీతో పొత్తుపై స్పందించారు ఆ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరి… రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆమె… వైసీపీతో పొత్తు ఉండదని… జనసేన పార్టీతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.  రాజధాని మార్పు, పీఏఏల రద్దు తొందరపాటు నిర్ణయాలను అని మండిపడ్డారు పురంధేశ్వరి… మరోవైపు పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ వల్ల కోర్టులకు వెళ్లే పరిస్థితి ఉందన్న ఆమె… ప్రతిపక్షంగా టీడీపీ సరైన పాత్ర పోషించడంలేదని విమర్శించారు. శాసనమండలి రద్దు నిర్ణయం కూడా సరైందని కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పురంధేశ్వరి… సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు.

Purandeswari Gives Clarity On YCP-BJP Alliance,jagan , delhi tour, ycp, bjp ,alliance , purandhareshwari

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article