రాజధాని రైతులకు షాక్ ఇచ్చిన బీజేపీ నేత పురంధరేశ్వరి

Purandhareshwari Gave Shock To Capital Farmers

ఏపీలో మూడు రాజధానులు కావాలంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన, ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలు అందరికీ తెలిసిందే. సీఎం జగన్ ప్రకటనతో అమరావతికి భూములు ఇచ్చిన రైతులు పోరుబాట పట్టారు. టీడీపీ నేతల ప్రోద్బలంతో ఆందోళనలకు శ్రీకారం చుట్టారన్న విమర్శలున్నాయి.. వైసీపీ ఏకంగా పోరాటం చేస్తున్నది టీడీపీ నేతలే అని చెప్తున్న పరిస్థితి. తాజాగా రాజధాని రైతులు ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించుకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా అడ్డుకోవాలని బీజేపీ సీనియర్ నాయకురాలు పురంధేశ్వరిని కలిశారు. కానీ పురంధేశ్వరి ఈ విషయంలో చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. అభివృద్ధి వికేంద్రీకరణకు బీజేపీ మొదటి నుంచి సమర్థిస్తుందని చెప్పి పురంధేశ్వరి రాజధాని రైతులకు చంద్రబాబుకు షాకిచ్చారు. రైతులు భూములు రాజకీయ నాయకులకు ఇవ్వలేదని, భూములు ప్రభుత్వానికి ఇచ్చారని ఆమె తెలిపారు. గతంలో అధికారంలో ఉన్న  ఉన్నవారు మొదట రాజధాని రైతులకు సమాధానం చెప్పాలని పురంధేశ్వరి స్పష్టం చేశారు. ఇక తాజా జగన్ ప్రభుత్వం రాజధాని ప్రాంత రైతులకు ఏం చెబుతుందో చూసిన తర్వాత బీజేపీ స్పందిస్తుందని పురంధేశ్వరి తెలిపారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కేంద్రం 2500 కోట్ల రూపాయలు నిధులిస్తే చంద్రబాబు వాటితో గ్రాఫిక్స్ చేయించి చూపారని.. చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణానికి బాబు పనిచేయలేదని ఆరోపించారు పురంధరేశ్వరి. మూడు రాజధానుల వ్యవహారంలో వైసీపీ, టీడీపీలు సమాధానం చెప్పాక బీజేపీ ఏం చేస్తుందో చెప్తానని పురంధరేశ్వరి తెలిపారు.

tags : Purandhareshwari, BJP Leader, AP Capital, Three Capitals, CM Jagan, JaganMohanReddy, Chandrababu

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article