పూరీ జగన్నాథ్ .. మణిశర్మను తప్పించడం ఓ జోక్

34
Puri movie update
Puri movie update

Puri movie update

కొత్తశతాబ్ధిలో దర్శకుడుగా తన ముద్రను బలంగా వేసినవాళ్లలో పూరీ జగన్నాథ్ ను ముందు వరుసలో చెప్పుకుంటారు. ఒకప్పుడు దాసరి నారాయణరావు, రామ్ గోపాల్ వర్మలను చూసి కొత్తవాళ్లంతా ఎలా దర్శకులు కావాలనుకున్నారో.. అలా పూరీ కూడా యంగ్ స్టర్స్ పై తన ముద్రను వేశాడు. అదే టైమ్ లో పూరీ వల్ల ఇండస్ట్రీలో, కథల్లో కాస్త వల్గారిటీ కూడా పెరిగింది అనేవాళ్లూ ఉన్నారు. తన హీరోలను ఓవర్ ద టాప్ తీసుకువెళ్లి కాస్త అతి చేయించాడు అని కూడా అంటారు. ఏదైతేనేం.. ఒక దశలో పూరీ డైరెక్షన్ లో సినిమా చేయాలని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. అలాంటి పూరీ మధ్య గాడి తప్పాడు. రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాలతో ఓ రేంజ్ లో విసిగించాడు. ఫైనల్ గా టెంపర్ తర్వాత చాలాకాలానికి రీసెంట్ గా ఇస్మార్ట్ శంకర్ తో మరో భారీ హిట్అందుకున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ‘ఫైటర్’(వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి కరణ్ జోహార్ కూడా బ్యాక్ ఎండ్ గా మారడంతో తెలుగు ప్రాజెక్ట్ కాస్తా ప్యాన్ ఇండియన్ మూవీ అయిపోయింది. అయితే ఇస్మార్ట్ శంకర్ విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించిన మణిశర్మనే ఈ చిత్రానికీ సంగీత దర్శకుడుగా తీసుకున్నారు అనే వార్తలు వచ్చాయి.

లేటెస్ట్ గా మణిని తప్పించి మరో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తోనే సంగీతం చేయించబోతున్నారు. ఇది మణిశర్మకు అవమానం. పూరీ మాట తప్పాడు. నమ్మకద్రోహం చేశాడు అంటూ కొందరు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. కానీ వాస్తవం వేరే ఉంది. నిజానికి ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు అఫీషియల్ గా ఎప్పుడూ ప్రకటించలేదు. కేవలం మణిశర్మను కూడా పరిశీలించారు అనుకున్నారు. మరోవైపు మణిశర్మ వికీ పీడియాలో కూడా ఈ మూవీ లిస్ట్ లో ఉంది. దీంతో అది నిజమే అనుకున్నారు చాలామంది. అయితే ముందు నుంచీ ఈ టీమ్ మణిశర్మను కన్సిడర్ చేశారు కానీ.. కన్ఫార్మ్ చేయలేదు అనేది పూరీ వైపు నుంచి వినిపిస్తోన్న వెర్షన్. అయితే మొదట్లో కాస్ట్ అండ్ క్రూను ప్రకటించినప్పుడు కూడా మణి పేరు వినిపించలేదు అనేది నిజం. కాకపోతే ఇస్మార్ట్ శంకర్ వంటి బిగ్గెస్ట్ హిట్ లో భాగస్వామి కాబట్టి అతన్నే కంటిన్యూ చేస్తాడు అనుకున్నారు. ఇక కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్ కూడా పూరీతో ‘కనెక్ట్’ అయ్యాక అసలు ఆ పేరును పరిగణలోంచి కూడా తీసేశారు అనుకుంటారు. మొత్తంగా మణిశర్మ ఉంటే చాలా బావుండేదే. కానీ తీసుకోని వ్యక్తిని తీసేశారు అని చెప్పడం కూడా బాలేదనే చెప్పాలి.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here